CRIME : వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య
CRIME : వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య
Advertisement

అక్షరటుడే, భీమ్‌గల్: CRIME : వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడినట్లు భీమ్ గల్ ఎస్సై మహేష్ తెలిపారు. జక్రాన్ పల్లికి చెందిన సుమలత (28)కు లింబాద్రిగుట్ట వడ్డెర కాలనీకి చెందిన సంతోష్ తో వివాహమైంది. ఈ క్రమంలో ఆమె తోటి కోడలు లావణ్యతో తరచూ గొడవలు జరిగేవి. ఇటీవల లావణ్య సుమలతపై దాడి చేసింది. దీంతో తోటి కోడలిపై సుమలత కేసు పెట్టింది. ఈ కేసు విషయమై సుమలతను లావణ్య, ఆమె కుటుంబ సభ్యులు వేధిస్తున్నారు. దీంతో వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నం చేయగా, చికిత్స నిమిత్తం నిజామాబాద్ లోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు ఎస్సై చెప్పారు. మృతురాలి తండ్రి బాలయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Bheemgal : బంధువుల రాస్తారోకో..

సుమలతను మానసికంగా వేధించి ఆమె ఆత్మహత్య చేసుకునేలా ఉసిగొల్పిన వారికి కఠినంగా శిక్షించాలని ఆమె బంధువులు డిమాండ్​ చేశారు. బుధవారం పోలీస్​స్టేషన్​ ఎదుట ధర్నాకు దిగడంతో సుమారు గంటపాటు ఉద్రిక్తత నెలకొంది. భీమ్‌గల్, ఏర్గట్ల ఎస్సైలు మహేష్, రాము మృతురాలి బంధువులను సముదాయించారు. మృతికి కారణమైన వారిపై కేసు నమోదు చేశామన్నారు.

Advertisement