CSI Church | చర్చి భూములు అమ్ముకునే హక్కు లేదు

CSI Church | చర్చి భూములు అమ్ముకునే హక్కు లేదు
CSI Church | చర్చి భూములు అమ్ముకునే హక్కు లేదు
Advertisement

అక్షర టుడే, ఆర్మూర్‌: CSI Church | పట్టణంలోని సీఎస్‌ఐ చర్చికి సంబంధించిన భూములను లీజుకు ఇచ్చేందుకు, అమ్మేందుకు హక్కు లేదని చర్చి అధ్యక్షుడు రవిచంద్రన్‌ అన్నారు. బుధవారం పట్టణంలోని ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడారు. చర్చికి సంబంధించిన 63 ఎకరాల స్థలాన్ని కొందరు అమ్ముకున్నారన్నారు. సమాధుల స్థలాన్ని సైతం విక్రయించారని చెప్పారు. ఇకపై చర్చి ఆస్తుల సంరక్షణే ధ్యేయంగా సంస్థ పనిచేస్తుందన్నారు. చర్చి భూముల అన్యాక్రాంతంపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో చర్చి ఉపాధ్యక్షుడు కృపానందం, అనిల్‌ కుమార్, బాబీ ప్రసాద్, డేవిడ్‌ రాజ్, పాల్‌రాజ్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement