ఏడాదికే కాంగ్రెస్​ సర్కారుపై మొహమెత్తిందా..?
ఏడాదికే కాంగ్రెస్​ సర్కారుపై మొహమెత్తిందా..?
Advertisement

అక్షరటుడే, హైదరాబాద్: Congress govt : రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై ప్రజలకు ఏడాది కాలంలోనే మొహమెత్తినట్లు తెలుస్తోంది. కరీంనగర్, ‌‌నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఓటమి చెందడం ఇందుకు అద్దం పడుతోంది. కాగా.. తాజా ఫలితాలతో రేవంత్ సర్కారుకు గట్టి షాక్ తగిలింది.

మూడు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఓకేచోట పోటీ చేసింది. ఆ ఒక్క స్థానాన్నే గెలిపించుకునేందుకు స్వ‌యంగా ముఖ్య‌మంత్రి రంగంలోకి దిగారు. క్షేత్రస్థాయికి వెళ్లి ప్ర‌చారం చేశారు. హెలికాప్టర్​లో ఓకే రోజు మూడు చోట్లలకు హాజరయ్యారు. అయినా కూడా ప్రభావం చూపలేకపోయారు.

Congress govt : పార్టీలో ముసలం

దీనికి తోడు సొంత పార్టీలోనే ముసలం మొదలైంది. కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కి సొంత పార్టీ నేతలపై విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గతంలోని తిరుగుబావుట ఎగురవేసి పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురయ్యారు. గత నెలలో 11 మంది ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశం జరపడం తీవ్ర చర్చకు దారి తీసింది. ఇటీవల పార్టీ సీనియర్ నేత హనుమంతరావు ఇంట్లో బీసీ నినాదం పేరిట ప్రతిపక్ష నేతలు సమావేశం కావడం వివాదాస్పదం అయింది.

Congress govt : స్థానిక సంస్థల ఎన్నికల వేళ

స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు అధికార కాంగ్రెస్ లో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవడం పార్టీకి తీవ్ర నష్టం తప్పదని విశ్లేషకులు చెబుతున్నారు. రానున్న. ఆరు నెలల్లో సర్పంచ్, పుర ఎన్నికలు నిర్వహించేందుకు సర్కారు కసరత్తు చేస్తోంది. కాగా.. ఉపాధ్యాయ, పట్టభద్రులు అధికార కాంగ్రెస్ వైపు లేకపోవడం ఆ పార్టీకి ఎన్నికల్లో తీవ్ర నష్టం చేకూర్చే అవకాశం ఉంది. నిరుద్యోగ యువతలోనూ వ్యతిరేకత ఏర్పడింది. ఇలాంటి సమయంలో స్థానిక సంస్థలు ఎన్నికలు జరిగితే హస్తం పార్టీ కంటే బీజేపీకి ఎక్కువ మేలు జరిగే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఇది కూడా చ‌ద‌వండి :  MLA quota MLC | నేడు నామినేషన్‌ దాఖలు చేయనున్న ఎమ్మెల్సీ అభ్యర్థులు

Congress govt : దిద్దుబాటు చర్యలు

ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ అధిష్టానం ఆరా తీసినట్లు సమాచారం. ఆరు గ్యారెంటీల పేరిట అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఇప్పటికే పలు గ్యారంటిలను అమలు చేసింది. అయినప్పటికీ.. అన్ని వర్గాల్లో అసంతృప్తి నెలకొంది. మరోవైపు పార్టీ నేతల్లో అంతర్గత కుమ్ములాట మొదలైంది. ఈ నేపథ్యంలో ఏఐసీసీ వర్గాలు దిద్దుబాటు చర్యలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది.

Advertisement