
అక్షరటుడే, వెబ్‌డెస్క్: cricketer | ఒకప్పుడు క్రికెటర్స్ ఆదాయం అంత పెద్దగా ఉండేది కాదు. ఇప్పుడు అలా కాదు, వారు కోట్లు సంపాదిస్తున్నారు. ముఖ్యంగా బ్రాండ్ ప్రమోషన్స్ తో వారి ఆదాయం రోజు రోజుకి రెట్టింపు అవుతుంది. అయితే ఇప్పుడు పాకిస్తాన్ తరపున అనేక మ్యాచ్‌లను గెలిచిన ఆటగాడు ఎవరూ ఊహించలేని విధంగా దయనీయమైన స్థితిలో ఉండడం అందరిని కన్నీరు పెట్టిస్తుంది. మరి ఆ ఆటగాడు మరెవరో కాదు ఉమర్ అక్మల్.
పాకిస్తాన్ జట్టు తరపున 16 టెస్టులు, 121 వన్డేలు, 84 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన ఇతను తాజాగా ఒక టాక్ షోలో మాట్లాడుతూ.. తన ఆర్థిక పరిస్థితి మరింత దారుణంగా ఉందని, తన కూతురిని స్కూల్‌కి పంపించడానికి కూడా తగిన మొత్తం లేదని చెప్పుకొచ్చాడు.
cricketer | అంత ధీన స్థితి ఏంటి..
“కనీసం మెక్‌డొనాల్డ్స్‌లో నా కూతురిని తినిపించెంత డబ్బు కూడా నా దగ్గర లేదు. అయితే ఫీజు కట్టడానికి నా దగ్గర డబ్బు లేనందున నేను గత 8 నెలలుగా నా కూతురిని స్కూల్‌కి పంపించడం లేదు. అయితే కష్ట సమయంలో తనకి ఎవరు మద్ధతు ఇవ్వలేదని, కేవలం నా భార్య మాత్రమే నాకు సపోర్ట్‌గా నిలిచింది” అని చెప్పుకొచ్చాడు. నా భార్య నాకు ప్రాణ స్నేహితురాలి కన్నా ఎక్కువ. ఏం జరిగిన మీతోనే ఉంటాను అంటూ నాకు ధైర్యం ఇచ్చిందంటూ ఉద్వేగంతో మాట్లాడాడు. అయితే ఉమర్ బాబర్ ఆజం బంధువు..బాబర్ క్రికెట్ లో ఓనమాలు నేర్చుకుంటున్నప్పుడు, ఉమర్ అక్మల్ పాకిస్తాన్ స్టార్ బ్యాట్స్‌మన్ గా ఉన్నాడు.
అయితే బాబర్ తనకు బంధువు అయినా కూడా ఏమాత్రం సహాయం చేయలేదని ఉమర్ అక్మల్ ఆరోపించాడు. తనకు ఇష్టమైన అబ్బాయిలను ఆడించేవాడని, పాకిస్తాన్ బెంచ్ స్ట్రెంత్‌ను పట్టించుకోలేదంటూ అతనిపై విమర్శలు చేశాడు. ఇక ఉమర్ అక్మల్ కెరీర్ పరిశిలీస్తే.. ఆయన పాక్ తరపున 16 టెస్టుల్లో 35 కంటే ఎక్కువ సగటుతో 1003 పరుగులు చేశాడు. వన్డేల్లో 121 మ్యాచ్‌లు ఆడిన ఉమర్ 3194 పరుగులు చేశాడు. అందులో 2 సెంచరీలు, 20 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఉమర్ అక్మల్ తన కెరీర్‌లో మొత్తం 25 సెంచరీలు సాధించాడు. కాగా.. ఆయన గత 6 సంవత్సరాలుగా అంతర్జాతీయ క్రికెట్ ఆడడంలేదు. 2019లో చివరి మ్యాచ్ ఆడాడు.