Janhvi Kapoor | బ‌ర్త్ డే రోజు జాన్వీ క‌పూర్ కేక పెట్టించే అందాల‌తో చంపేస్తుందిగా..!

Janhvi Kapoor | బ‌ర్త్ డే రోజు జాన్వీ క‌పూర్ కేక పెట్టించే అందాల‌తో చంపేస్తుందిగా..!
Janhvi Kapoor | బ‌ర్త్ డే రోజు జాన్వీ క‌పూర్ కేక పెట్టించే అందాల‌తో చంపేస్తుందిగా..!
Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Janhvi Kapoor | అతిలోక సుంద‌రి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ క‌పూర్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. చూడ చ‌క్క‌ని అందం, ఆక‌ట్టుకునే అభిన‌యంతో క‌ట్టిప‌డేస్తుంటుంది జాన్వీ. ఈ ముద్దుగుమ్మ నేడు (మార్చి 6) తన 28వ పుట్టినరోజును జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఆమెకి ప‌లువురు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. ‘దేవర’ టీం శుభాకాంక్షలు తెలియజేస్తూ.. తంగం క్యారక్టర్ కు సంబంధించిన కొత్త పోస్టర్ ను పంచుక‌కోగా, ఇది నెట్టింట వైర‌ల్ అయింది. ఇందులో జాన్వీ భుజాన చేపలను తగిలించుకొని, నోటితో కత్తిని పట్టుకొని కనిపించింది. కోర చూపులు చూస్తున్న జాన్వీ లుక్ కేక అని కొంద‌రు కామెంట్ చేస్తున్నారు.

Janhvi Kapoor | జాన్వీ ర‌చ్చ‌…

ఇక ఆర్సీ 16 సినిమాలో కూడా జాన్వీ క‌పూర్ క‌థానాయిక‌గా న‌టిస్తుంది. ఈ క్రమంలో ఓ పోస్ట‌ర్ రిలీజ్ చేశారు. ఇందులో జాన్వీ క‌పూర్ కుడి చేత్తో గొర్రె పిల్ల‌ను ఎత్తుకోగా, ఎడ‌మ చేత్తో గ‌డ్డి మొక్క‌ను ప‌ట్టుకుని చిరున‌వ్వులు చిందిస్తూ ర‌చ్చ చేస్తుంది. ప్ర‌స్తుతం ఈ పిక్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్​గా మారింది. నెటిజ‌న్స్ జాన్వీ కపూర్ లుక్ సూపర్​​గా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇదిలా ఉంటే జాన్వీ కొన్ని క్రేజీ ఫొటోలు వ‌దిలింది. ఇందులో ఈ అమ్మ‌డు లుక్ రెచ్చ‌గొట్టేలా ఉంది. టైట్ డ్రెస్ లో ఘాటు లుక్స్‌తో పిచ్చెక్కిస్తుంది ఈ అందాల ముద్దుగుమ్మ‌. అస‌లు జాన్వీ క‌పూర్ ఇంత హాట్‌గా ఉందేంట‌ని కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు.

ఇది కూడా చ‌ద‌వండి :  Khushi Kapoor : మామ్ సీక్వెల్ లో శ్రీదేవి రెండో కూతురు.. ఖుషి కపూర్ కోసం బోని కపూర్ ప్లాన్ అదుర్స్..!

జాన్వీ కపూర్ డేటింగ్ హిస్టరీలో చాలా రూమర్స్ ఉన్నాయి, నిజమైన రిలేషన్స్ కూడా ఉన్నాయి. ఆమె లవ్ లైఫ్ ఎప్పుడూ కూడా హాట్ టాపిక్కే. బాలీవుడ్‌లోకి రాకముందు జాన్వీ కపూర్, గామన్ ఇండియా ఛైర్మన్ కొడుకు అక్షత్ రాజన్‌తో డేటింగ్ చేసింది. ఏమైందో ఏమో కొన్ని రోజుల‌కి అతనికి విడాకులు ఇచ్చింది. ఇక ఇషాన్ ఖట్టర్ ప్రేమలో పడ్డారు, చాలాసార్లు కలిసి కనిపించారు. కాని అది బ్రేక‌ప్ అయింది. కార్తీక్ ఆర్యన్, జాన్వీ మధ్య ఏదో ఉందని రూమర్స్ వచ్చాయి. కాని ఆ రిలేష‌న్ గురించి ప‌క్కా క్లారిటీ లేదు. ఇక శిఖర్ పహారియాతో మళ్లీ స్నేహం మొదలుపెట్టింది. పెళ్లిళ్లు, ఫ్యామిలీ గెట్-టుగెదర్స్‌లో కలిసి కనిపించారు. వీరు పెళ్లి చేసుకుంటారా లేదా అనేది తెలియాల్సి ఉంది.

Advertisement