అక్షరటుడే, ఇందూరుః Lok Adalat | జిల్లాకేంద్రంలో ఈనెల 8న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జడ్జి, న్యాయసేవాధికార సంస్థ ఛైర్మన్ సునీత కుంచాల సూచించారు. జిల్లా కేంద్రంలోని కోర్టు సముదాయంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. బాధితులకు సత్వర పరిష్కార మార్గం సూచించేందుకే లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పోక్సో కేసుల్లో బాధితులకు, హత్యకేసుల్లో తల్లిదండ్రులను కోల్పోయిన బాలలకు ఆర్థికంగా అండగా నిలుస్తున్నామని పేర్కొన్నారు. రాజీ పద్దతిలో క్రిమినల్ కేసులు, అన్నిరకాల సివిల్ కేసులు జాతీయ లోక్ అదాలత్‌లో పరిష్కరించుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. కక్షిదారులు శనివారం నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను వినియోగించుకోవాలని ఆమె సూచించారు.
Lok Adalat | జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి
Advertisement
Advertisement