గెస్ట్ లెక్చ‌ర‌ర్ నోటిఫికేష‌న్‌ను ర‌ద్దు చేయాలి
గెస్ట్ లెక్చ‌ర‌ర్ నోటిఫికేష‌న్‌ను ర‌ద్దు చేయాలి
Advertisement

అక్షరటుడే, ఇందూరు: TU : తెలంగాణ విశ్వవిద్యాలయంలో రహస్యంగా విడుదల చేసిన అతిథి అధ్యాపకుల ఉద్యోగ నియామక నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని ఏఐఎస్ఎఫ్ అధ్యక్ష కార్యదర్శులు అంజలి, రఘురాం డిమాండ్ చేశారు. శుక్రవారం యూనివర్సిటీ రిజిస్ట్రార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గతనెల 24న తెలుగు, ఇంగ్లిష్, కెమిస్ట్రీ, సోషల్ సబ్జెక్ట్‌లకు సంబంధించి మొత్తం ఐదు అతిథి అధ్యాపకుల నియామక ప్రకటన విడుదల చేశారన్నారు. కానీ పూర్తి వివరాలు లేకుండానే ప్రకటించారన్నారు.

ఇది కూడా చ‌ద‌వండి :  Telangana University | తెయూలో కొత్త వివాదం.. విద్యార్థి సంఘాల నిరసనలు

కనీసం పత్రికా ప్రకటన కూడా ఇవ్వకుండా లోలోపల భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. అధికారులు స్పందించి రీనోటిఫికేషన్ ఇవ్వాలని కోరారు. లేని పక్షంలో గవర్నర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. వినతిపత్రం అందించిన వారిలో సంజయ్, అజయ్, గౌతమ్, విజయ్, దినేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement