అక్షరటుడే, వెబ్డెస్క్ : Nara Lokesh : ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పలు కీలక నిర్ణయాలను తీసుకుంటూ వస్తోంది. అధికారంలోకి వచ్చి సంవత్సరం కూడా కాలేదు కానీ.. కూటమి ప్రభుత్వం ఎన్నో గొప్ప నిర్ణయాలను తీసుకున్నదనే చెప్పొచ్చు. తాజాగా ఏపీ అసెంబ్లీలో మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. ఆ ప్రకటనతో ఏపీలోని స్కూళ్లకు చెందిన విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
స్కూల్ కు వెళ్లాలంటే బరువుతో ఉండే బ్యాగ్ లను విద్యార్థులను మోసుకెళ్లాల్సి వస్తోంది. క్లాస్ తో సంబంధం లేకుండా అన్ని తరగతుల విద్యార్థులు భారీగా పుస్తకాలను మోసుకెళ్లడం ఇబ్బందిగా మారడంతో విద్యార్థులపై బ్యాగ్ భారం లేకుండా ఇక నుంచి చర్యలు తీసుకుంటామని మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో హామీ ఇచ్చారు.
Nara Lokesh : సెమిస్టర్ల వారీగా పుస్తకాలను బైండ్ చేసి ఇస్తాం
ఇక నుంచి సెమిస్టర్ల వారీగా ప్రతి సబ్జెక్ట్ కు చెందిన పుస్తకాలను బైండ్ చేసి ఇస్తామని మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో వెల్లడించారు. అలాగే నాణ్యమైన యూనిఫామ్ తో ఉన్న కిట్ ను కూడా స్కూల్ విద్యార్థులకు అందజేస్తామని నారా లోకేష్ హామీ ఇచ్చారు.
విద్య వ్యవస్థపై ఫోకస్ గా ఉన్నామన్నారు. మహారాష్ట్రలో అవలంభిస్తున్న సెమిస్టర్ల వారీగా సబ్జెక్ట్ ల పుస్తకాలను తీసుకెళ్లే విధానాన్నే ఏపీలో కూడా అమలు చేస్తామని నారా లోకేష్ అసెంబ్లీలో స్పష్టం చేశారు.