అక్షరటుడే, ఇందూరు: Nizamabad | నగరంలోని కోటగల్లి ప్రభుత్వ బాలుర పాఠశాల విద్యార్థులు శుక్రవారం ప్రకృతి క్షేత్ర సందర్శనకు వెళ్లారు.ఇందులో భాగంగా ఎడపల్లి మండలంలోని పాపారావు వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించారు. అతి తక్కువ స్థలంలో ఎక్కువ రకాల పండ్లు, కూరగాయలు మొక్కలు పండిస్తున్న తీరును వివరించారు. అనంతరం సారంగాపూర్‌లోని విజయ డైరీని సందర్శించారు. పాల ఉత్పత్తి విధానం ప్యాకింగ్ విధానం తదితర అంశాలను ప్రత్యక్షంగా చూశారు. కార్యక్రమంలో హెచ్ఎం మల్లేశం, ఉపాధ్యాయులు గంగా కిషన్, మాధవి, రాములు, శ్రీహరి, రజిని తదితరులు పాల్గొన్నారు.
Nizamabad | ప్రకృతి కేంద్రం సందర్శించిన విద్యార్థులు
Advertisement
Advertisement