అక్షరటుడే, హైదరాబాద్: Spy camera : హైదరాబాద్ పరిధి అమీన్‌పూర్ కిష్టారెడ్డిపేటలోని ఓ గర్ల్స్ హాస్టల్‌లో స్పై కెమెరా కలకలం రేపింది. వసతి గృహంలో విద్యార్థినులు స్పై కెమెరాను గుర్తించారు. ఈ మేరకు పోలీసులకు విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కాగా, గతంలో ఇలాంటి ఘటనలు రాష్ట్ర రాజధానిలో చాలానే వెలుగు చూశాయి. మేడ్చల్లో ఉన్న సీఎంఆర్ కాలేజీలో గత జనవరిలో ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. గతేడాది ఆగస్టులో ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లోని కృష్ణాజిల్లా గుడివాడలోని గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో కూడా హిడెన్ కెమెరాలు కలకలం రేపాయి. యాజమాన్యాల పర్యవేక్షణ పటిష్టంగా లేకపోవడంతో ఇలాంటి ఘటనలు తరచూ వెలుగు చూస్తున్నాయి. కొందరు కీచకుల వల్ల అమాయక బాలికలు బలవుతున్నారు.