Nani : కోర్ట్ సినిమా ఈవెంట్ లో నాని బిగ్ ఛాలెంజ్.. హిట్ 3 ఎవరు చూడొద్దు అంటూ..!

Nani : కోర్ట్ సినిమా ఈవెంట్ లో నాని బిగ్ ఛాలెంజ్.. హిట్ 3 ఎవరు చూడొద్దు అంటూ..!
Nani : కోర్ట్ సినిమా ఈవెంట్ లో నాని బిగ్ ఛాలెంజ్.. హిట్ 3 ఎవరు చూడొద్దు అంటూ..!
Advertisement

అక్ష‌ర‌టుడే, వెబ్‌డెస్క్ Nani : న్యాచురల్ స్టార్ నిర్మించిన లేటెస్ట్ సినిమా కోర్ట్. రామ్ జగదీష్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో హర్ష్ రోషన్, శ్రీదేవి, ప్రియదర్శి ప్రధాన పాత్రలుగా నటించారు. ప్రస్తుతం మన చుట్టూ సమాజంలో జరుగుతున్న విషయాల గురించి ప్రస్తావిస్తూ ఒక అద్భుతమైన సినిమాగా తీర్చిదిద్దారు. ఐతే కోర్ట్ సినిమా విషయంలో నాని ముందు నుంచి చాలా కాన్ ఫిడెంట్ గా ఉన్నాడు. సినిమా ఎంతమందికంటే అంతమంది ఆడియన్స్ కి రీచ్ అవ్వాలని కోరుతున్నాడు.

అందుకే సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో నానితో పనిచేసిన కొత్త దర్శకులందరినీ వేదిక మీదకు తీసుకొచ్చాడు. వాళ్లంతా నాని ఇచ్చిన సపోర్ట్ కాన్ ఫిడెన్స్ గురించి చెప్పారు. ఐతే కోర్ట్ సినిమా ఈవెంట్ లో నాని మాట్లాడుతూ ఈ సినిమా చూడండి చూసి నచ్చకపోతే త్వరలో రాబోతున్న హిట్ 3 సినిమాను ఎవరు చూడకండి అని అన్నాడు. చాలా నమ్మకం ఉంటే తప్ప అలాంటి కామెంట్ చేయరు.

Nani : కోర్ట్ సినిమాపై అతనికి ఉన్న ప్రేమ

అసలు నానికి అలా ఛాలెంజ్ చేయాలని ఎందుకు అనిపించింది అంటే కోర్ట్ సినిమాపై అతనికి ఉన్న ప్రేమ అని తెలుస్తుంది. ఈవెంట్ లో మార్చి 14న కోర్ట్ సినిమా రిలీజ్ అవుతుంది. నా మీద నమ్మకం ఉంచి మీరు సినిమా చూడండి ఆ తర్వాత మారే మరికొంతమందికి చెబుతారని అన్నాడు నాని. సొంత సినిమాను ప్రమోట్ చేయడం అందరు చేస్తారు కానీ నానిలా ఇలా కాన్ ఫిడెంట్ గా చెప్పడం చాలా కష్టం.

ఇది కూడా చ‌ద‌వండి :  The Paradise : గ్లింప్స్‌లో నాని రెండు జ‌డ‌ల వెన‌క ద‌ర్శ‌కుడి ఎమోష‌న‌ల్ క‌నెక్ష‌న్.. ట్విస్ట్ రివీల్ చేశాడుగా..!

ముఖ్యంగా తన నెక్స్ట్ సినిమా హిట్ 3 ని కూడా తనే నిర్మిస్తున్నాడు. అది ఒక రకంగా నాని నుంచి వస్తున్న మోస్ట్ వైలెంట్ సినిమాగా అనిపిస్తుంది. కోర్ట్ సినిమా ఛాలెంజ్ చేస్తూ హిట్ 3 మీద పందెం కట్టాడు నాని. అంటే నాని ఇష్టపడి నిర్మించిన కోర్ట్ నటించి నిర్మిస్తున్న హిట్ 3 రెండు అద్భుతాలే అన్నట్టుగా చెప్పుకొచ్చాడు. మరి నాని ఇంత కాన్ ఫిడెంట్ గా చెప్పిన కోర్ట్ ఎలా ఉంటుందో చూడాలి.

Advertisement