Ration Cards : మార్చి 31 లోపు ఆ ప‌ని చేయ‌క‌పోతే వారికి రేష‌న్ కార్డులు క‌ట్..!

Ration Cards : మార్చి 31 లోపు ఆ ప‌ని చేయ‌క‌పోతే వారికి రేష‌న్ కార్డులు క‌ట్..!
Ration Cards : మార్చి 31 లోపు ఆ ప‌ని చేయ‌క‌పోతే వారికి రేష‌న్ కార్డులు క‌ట్..!
Advertisement

అక్ష‌ర‌టుడే, వెబ్‌డెస్క్‌ Ration Cards : కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దేశంలోని పేదలు, నిరుపేదల కోసం అనేక పథకాలను అమ‌లు చేస్తున్న విష‌యం తెలిసిందే. ముఖ్యంగా మ‌హిళలు, రైతులు, ఆర్థికంగా బ‌ల‌హీనంగా ఉన్నవారికి ఉప‌శ‌మ‌నం క‌లిగించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు అనేక ర‌కాల ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్న విష‌యం తెలిసిందే. ప్రస్తుతం భారతదేశంలో కోట్లాది మంది రేషన్ కార్డును సద్వినియోగం చేసుకుంటున్నారు. అయితే ప్రజలు తమ రేషన్ కార్డును ఆధార్‌తో అనుసంధానించాలని ప్రభుత్వం సూచించింది. మీరు ఇలా చేయకపోతే మీకు రేషన్ కట్ అయ్యే అవకాశం ఉంది. ఇందులో భాగంగా ప్ర‌తి ఒక్క‌రు ఈ కేవైసీ చేయించుకోవాల్సి ఉంటుంది.

Ration Cards : ఇది త‌ప్ప‌నిస‌రి..

ప్రజా పంపిణీ వ్యవస్థలో బోగస్ కార్డులు, నకిలీ కార్డులను ఏరివేసే ప్రక్రియలో భాగంగా దీనిని తీసుకొచ్చారు. వార్షిక ఆదాయం అధికంగా ఉన్న వారికి కూడా రేషన్ కార్డులు ఇచ్చారనేది మొదటి నుంచి వస్తున్న ఆరోపణ. అందుకే రేషన్ కార్డుల విష‌యంలో ప్ర‌భుత్వం చాలా నిబంధ‌న‌లు తీసుకొస్తుంది. మార్చి 31 లోపు ఏ సభ్యుడి ఆధార్ సీడింగ్ చేయకపోతే, అతను/ఆమె 2025 ఏప్రిల్ 1 నుండి రేషన్ కార్డు ప్రయోజనాన్ని పొందలేరు. కాబట్టి, అన్ని రేషన్ కార్డుదారులు ఈ ప్రక్రియను సకాలంలో పూర్తి చేయాలి. దాని ప్రక్రియ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మీరు ముందుగా దగ్గర్లోని రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళండి.

ఆధార్ కార్డు, రేషన్ కార్డు మీ వెంట తీసుకెళ్లండి. బయోమెట్రిక్ లేదా ఫేషియల్ ఈ-కెవైసి ద్వారా ధృవీకరించండి. ధృవీకరణ తర్వాత ఆధార్ లింకింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. ప్రభుత్వ నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా 80 కోట్లకు పైగా ప్రజలు ఉచిత రేషన్ పథకం ద్వారా ప్రయోజనం పొందుతున్నారు. దారిద్య్రరేఖకు దిగువన (బిపిఎల్) నివసిస్తున్న వారికి గోధుమలు, బియ్యం ఉచితంగా ఇస్తున్నారు. రేషన్ కార్డుదారులు మార్చి 31 లోపు ఆధార్‌ను తప్పనిసరిగా లింక్ చేయాలి. మీరు ఈ కేవైసీ చేయించుకోవాలి అనుకుంటే మేరా ఈ కేవైసీ లేదా ఆధార్ ఫేస్ ఆర్డీ యాప్‌ని కూడా డౌన్‌లోడ్ చేసుకొని అవ‌కాశాల‌ని వినియోగించుకోవ‌చ్చు.

Advertisement