Venkatesh : వెంకటేష్ ది ఏమి లేదు అంతా సురేష్ బాబు చేతుల్లోనే.. యువ రచయిత సంచలన కామెంట్స్..!

Venkatesh : వెంకటేష్ ది ఏమి లేదు అంతా సురేష్ బాబు చేతుల్లోనే.. యువ రచయిత సంచలన కామెంట్స్..!
Venkatesh : వెంకటేష్ ది ఏమి లేదు అంతా సురేష్ బాబు చేతుల్లోనే.. యువ రచయిత సంచలన కామెంట్స్..!
Advertisement

అక్ష‌ర‌టుడే, వెబ్‌డెస్క్‌ Venkatesh : విక్టరీ వెంకటేష్ సినిమా చేయాలంటే ఆయన కథ విని ఓకే చేసినా కూడా ఆయన తర్వాత ఆయన బ్రదర్ సురేష్ బాబు కథ వినాల్సి ఉంటుంది. వెంకటేష్ కి నచ్చినా కూడా సురేష్ బాబుకి కూడా కథ నచ్చితేనే ఆ ప్రాజెక్ట్ ఓకే అవుతుంది. వెంకటేష్ కి నచ్చి డేట్స్ ఇస్తానని చెప్పినా కూడా సురేష్ బాబు వద్దంటే మాత్రం ఆ సినిమా ఆగిపోతుంది. ఇది చాలా సందర్భాల్లో చాలామంది దర్శకులకు జరిగింది.

ఐతే ఎవరు బయట పెట్టలేదు. లేటెస్ట్ గా ఈ విషయంపై స్పందిస్తూ సంచలన కామెంట్స్ చేశారు సక్సెస్ ఫుల్ రైటర్ ప్రసన్న కుమార్. ధమాకాతో హిట్టు కొట్టి మజాకా సినిమాతో అలరించిన రైటర్ ప్రసన్న కుమార్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పాల్గొన్న ఇంటర్వ్యూలో వెంకటేష్ గారికి కథ చెప్పగా ఆయన చేసేద్దాం అన్నారు. ఒకసారి సురేష్ బాబుకి కథ చెప్పమన్నారు.

Venkatesh : ముగ్గురికి మూడు నరేషన్స్

సురేష్ బాబు కూడా కథ విన్నారు ఆ తర్వాత మరో ముగ్గురికి కథ వినిపించారు. ఐతే అలా వచ్చిన ముగ్గురికి మూడు నరేషన్స్ ఇచ్చాను. వాళ్లకి కూడా నచ్చేసింది. ఐతే ఫైనల్ గా సురేష్ బాబు ఎవరేం చెప్పినా నా నిర్ణయం ప్రకారమే సినిమాకు వెళ్తా అంటూ చెప్పారు. ఆయన కొన్ని కరెక్షన్స్ చెప్పారు. ఐతే కథ ఆయనకు నచ్చలేదు అన్నది అర్ధమైందని అన్నారు ప్రసన్న కుమార్.

ఇది కూడా చ‌ద‌వండి :  హిట్టు సినిమా క్లైమాక్స్ మారిస్తే కానీ కొనమని చెప్పిన ఓటీటీ సంస్థ.. ఎందుకలా..?

ఆయనకు నచ్చితేనే వెంకటేష్ సినిమా చేస్తారు అన్నట్టుగా ప్రసన్న కుమార్ కామెంట్స్ ఉన్నాయి. ఐతే వెంకటేష్ సినిమా చేయాలంటే సురేష్ బాబుకి నచ్చాలన్నది ఒకప్పటి సెంటిమెంట్ కదా ఇప్పటికీ అదే ఫాలో అవుతున్నారా అని కామెంట్స్ చేస్తున్నారు. ఐతే ప్రసన్న కుమార్ కామెంట్స్ దగ్గుబాటి ఫ్యాన్స్ ని కాస్త ఇబ్బంది పెడుతుంది. మరి దీనిపై ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. ఈ సంక్రాంతికి సంక్రాంతికి వస్తున్నాం తో సూపర్ హిట్ అందుకున్న వెంకటేష్ నెక్స్ట్ సినిమా ఎవరితో చేస్తాడన్నది క్లారిటీ రాలేదు.

Advertisement