అక్షరటుడే, ఆర్మూర్: రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం భద్రాచలం పట్టణంలో నిర్వహించిన అవార్డుల మహోత్సవంలో ఆర్మూర్ రోటరీ క్లబ్‌కు రెండు అవార్డులు దక్కాయి. ఉత్తమ అధ్యక్షుల విభాగంలో పట్వార్ గోపికృష్ణ, కార్యదర్శుల విభాగంలో పట్వార్ తులసీ కుమార్ కు అవార్డులు వచ్చాయి. ఆర్మూర్‌లో నిర్వహించిన పర్యావరణం, ఆరోగ్య శిబిరాలు, సామాజిక, విద్యా రంగాల్లో చేసిన కృషికి గాను అవార్డులు దక్కాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తాము చేసిన సేవలను గుర్తించినందుకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ మాజీ అధ్యక్షుడు ప్రవీణ్ పవార్, నిజామాబాద్ జిల్లా అసిస్టెంట్ గవర్నర్ శ్రీనివాస్, రోటరీ క్లబ్ జేమ్స్ నిజామాబాద్ అధ్యక్షుడు విజయ్‌కాంత్ తదితరులు పాల్గొన్నారు.