అక్షరటుడే, వెబ్‌డెస్క్ Ram Pothineni : గుంటూరు కారం తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ అసలైతే పుష్ప రాజ్ అదేనండి అల్లు అర్జున్ తో సినిమా చేయాల్సింది. కానీ ఆ సినిమాకు కాస్త టైం పట్టేలా ఉందని తెలుస్తుంది. పుష్ప–2 తర్వాత అల్లు అర్జున్ అట్లీ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా మొదలైందని తెలుస్తోంది. ఐతే అట్లీ సినిమా పూర్తయ్యే వరకు త్రివిక్రమ్ ఖాళీగానే ఉండాలి. ఈలోగా మరో హీరోతో సినిమా చేస్తాడా అన్న ఊహాగానాలు మొదలయ్యాయి.
ఈ క్రమంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో త్రివిక్రమ్ సినిమా ఉంటుందన్న టాక్ వచ్చింది. రామ్ తో త్రివిక్రమ్ సినిమా అనే వార్తలు కొన్నాళ్లుగా వినిపిస్తూనే ఉన్నాయి. ఐతే త్రివిక్రమ్ రామ్ సినిమా అసలు డిస్కషన్ లోనే లేదని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. రామ్ ప్రస్తుతం మహేష్ బాబు డైరెక్షన్ లో ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా పూర్తి కాగానే హరీష్ శంకర్ తో సినిమా చేసే ప్లానింగ్ లో ఉన్నాడు.
Ram Pothineni : మీడియా హడావిడి..
ఐతే త్రివిక్రమ్‌తో రామ్ సినిమా అంటూ మీడియా హడావిడి చేయడం మొదలు పెట్టింది. త్రివిక్రమ్‌కు రైటర్‌గా ఛాన్స్ ఇచ్చిన స్రవంతి రవికిషోర్ ఒక మాట అడగాలే కానీ రామ్ తో త్రివిక్రం సినిమా చేస్తాడు. ఐతే రామ్ మాత్రం తనకు సూటయ్యే పర్ఫెక్ట్ కథతో పాటుగా త్రివిక్రమ్‌తో చేయడానికి ఇదే కరెక్ట్ టైం అనిపించినప్పుడు చేయాలని అనుకుంటున్నాడు.
అందుకే త్రివిక్రమ్ రామ్ కాంబో సినిమా మరికొన్నాళ్లు ఆగాల్సిందే అని తెలుస్తుంది. రామ్ వరుస ఫ్లాపులు మళ్లీ ట్రాక్ తప్పేలా చేయగా తిరిగి ఫాంలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. రామ్ ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాలో భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాతో అయినా రామ్ తన మార్క్ హిట్ కొడతాడా లేదా అన్నది చూడాలి.