అక్షరటుడే, కామారెడ్డి: Excise Police | అక్రమంగా రవాణా చేస్తున్న 250 గ్రాముల నిషేధిత డ్రగ్స్(అల్ప్రాజోలం)ను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అల్ప్రాజోలం తరలిస్తున్నట్లుగా సమాచారం రావడంతో ఎక్సైజ్ పోలీసులు దాడి చేసి.. కామారెడ్డికి చెందిన మధుసూదన్ చారి, తాండూరు మండలం అక్కపల్లి గ్రామానికి చెందిన భూమా విఠల్ గౌడ్, గుండారం వెంకగౌడ్ను అదుపులోకి తీసుకున్నారు. వీరు ముగ్గురు సదాశివనగర్ మండలం భూంపల్లి గ్రామానికి చెందిన సురేశ్ గౌడ్ వద్ద అల్ప్రాజోలం కొనుగోలు చేశారు. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడు. ముగ్గురితో పాటు విక్రయదారుడు సురేశ్ గౌడ్‌పై కూడా కేసు నమోదు చేశామని, ఓ బైక్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కార్యక్రమంలో సీఐ స్వప్న, ఎస్సైలు రాంకుమార్, విక్రమ్ కుమార్, సిబ్బంది హమీద్, విష్ణు, అవినాష్, శ్యామ్ కుమార్ పాల్గొన్నారు.
Excise Police | భారీగా నిషేధిత డ్రగ్స్ పట్టివేత
Advertisement
Advertisement