అక్షరటుడే, వెబ్‌డెస్క్ Jasprit Bumrah : భారత్ స్పీడ్‌స్టర్ జస్‌ప్రీత్ బుమ్రా గత కొద్ది రోజులుగా టీమిండియాకి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా ఆయన దూరంగా ఉంటున్నాడు. అయితే ఐపీఎల్‌లో ఆయన పాల్గొంటాడని అందరు ఊహించిన ఇప్పుడు నిరాశే ఎదురైంది. మరి కొద్ది రోజులలో జరగనున్న ఐపీఎల్-2025 సీజన్ కోసం అన్ని ఫ్రాంచైజీలు ప్రాక్టీస్ మొదలుపెట్టేశాయి. డొమెస్టిక్ ప్లేయర్లతో పాటు ఇంటర్నేషనల్ స్టార్స్ కూడా ప్రిపరేషన్స్‌లో పాల్గొంటుండగా, టాప్ ఫ్రాంచైజీల్లో ఒకటైన ముంబై ఇండియన్స్ కూడా సన్నాహాలు షురూ చేసింది. అయితే సరిగ్గా సీజన్ ఆరంభానికి ముందు ఆ టీమ్‌కు పెద్ద ఝలక్ తగిలినట్టు అర్ధమవుతుంది.
Jasprit Bumrah : బుమ్రా ఇలా చేశావేంటి..!
గత జనవరిలో సిడ్నీలో జరిగిన ఐదో టెస్టులో గాయపడిన బుమ్రా.. అప్పటి నుంచి విశ్రాంతి తీసుకుంటున్నాడు. వెన్నునొప్పితో బాధపడుతున్న బుమ్రా.. బెంగళూరులోని ఎన్సీఏలో చికిత్స తీసుకుంటుండగా, ఇప్పటికే బౌలింగ్ ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టాడు. అయితే ఏప్రిల్ నెల తొలి వారం వరకు బుమ్రా మెగాటోర్నీలో బౌలింగ్ చేసే అవకాశం లేదని తెలుస్తోంది. బుమ్రా.. పూర్తి స్థాయిలో ఫిట్ అయి మెడికల్ టీం నుంచి క్లియరెన్స్ వస్తేనే తను ఐపీఎల్లో బరిలోకి దిగుతాడని తెలుస్తోంది. ఐపీఎల్ కొత్త సీజన్‌లో కనీసం 3 మ్యాచులు మిస్ అయ్యే ప్రమాదం ఉందని సమాచారం. క్యాష్ రిచ్ లీగ్ తొలి వారం అతడు అందుబాటులో ఉండటం లేదని క్రికెట్ వర్గాల్లో వినిపిస్తోంది.
వెన్నునొప్పితో బాధపడుతున్న బుమ్రా.. గాయం నుంచి కోలుకోకపోవడంతో చాంపియన్స్ ట్రోఫీ-2025లో కనిపించలేదు. బీసీసీఐ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. బుమ్రా మెడికల్ రిపోర్టులు బాగున్నాయట. అతడు వేగంగా కోలుకుంటున్నాడట. బౌలింగ్ ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టేశాడట. అయితే కంప్లీట్ రికవరీ కానందున ఐపీఎల్ తొలి మూడ్నాలుగు మ్యాచుల్లో అతడిని ఆడించే ఛాన్స్ లేదని అంటున్నారు. బుమ్రా ఇంకా ఫుల్ ఇంటెన్సిటీ, పేస్‌తో బౌలింగ్ చేయాల్సి ఉందని.. మెడికల్ టీమ్ సూచనల ప్రకారం అతడి ప్రాక్టీస్ క్రమంగా పెరుగుతూ పోతుందని తెలుస్తుంది.