Mega Family : మహిళా దినోత్సవం.. పవన్ కళ్యాణ్ అంటేనే అమ్మకు ఎక్కువ ఇష్టం.. చిన్న‌ప్పుడు ఒక‌సారి.. వీడియో

Mega Family : మహిళా దినోత్సవం.. పవన్ కళ్యాణ్ అంటేనే అమ్మకు ఎక్కువ ఇష్టం.. చిన్న‌ప్పుడు ఒక‌సారి..?
Mega Family : మహిళా దినోత్సవం.. పవన్ కళ్యాణ్ అంటేనే అమ్మకు ఎక్కువ ఇష్టం.. చిన్న‌ప్పుడు ఒక‌సారి..?
Advertisement

అక్ష‌ర‌టుడే, వెబ్‌డెస్క్‌ Mega Family : మహిళా దినోత్సవం రోజు మెగా స్టార్​ మదర్ అంజనా దేవితో మెగా ముచ్చట్లు స్పెషల్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి, నాగబాబుతో పాటు చిరంజీవి సోదరీమణులతో అంజనాదేవి పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో చిరంజీవి తమ ఫ్యామిలీ విషయాలన్నీ కూడా ఫ్యాన్స్ తో పంచుకున్నారు.

ముఖ్యంగా కుటుంబ స్థితిగతుల గురించి వారు పడిన కష్టం గురించి చెప్పారు. ఇక ఇదే ఇంటర్వ్యూలో నాగబాబు పవన్ కళ్యాణ్ ఎక్కువ తినేవాడు కాదు తనకు నచ్చితేనే తినే వాడు నచ్చకపోతే సైలెంట్​గా అక్కడ నుంచి వెళ్లిపోతాడని అన్నారు. అందుకే ఆ టైంలో కళ్యాణ్ బాబు చాలా వీక్ గా ఉంటాడని అన్నారు. అందుకే అమ్మ వాడిపై ఎక్కువ శ్రద్ధ పెట్టేది అని చెప్పారు.

Mega Family : అన్నయ్య ఏదైనా అడ్జెస్ట్ అయ్యేవాడు

ఐతే అన్నయ్య ఏదైనా అడ్జెస్ట్ అయ్యేవాడు.. ఐతే తాను మాత్రం నచ్చిన ఫుడ్ లేకపోతే మాత్రం గోల గోల చేసేవాడినని అన్నారు. ఈ ఇంటర్వ్యూలో భాగంగానే తన ఐదుగురితో పాటు మరో ముగ్గురు కూడా ఉన్నారని.. వాళ్లు చిన్నప్పుడే కాలం చేశారని అన్నారు చిరంజీవి. ముఖ్యంగా ఒక సోదరిని ఆమె అనారోగ్య కారణంగా నాన్నకు సరైన ఆదాయం లేక ఆమెకు బాగు చేయడానికి చాలా కష్టపడ్డారని అన్నారు చిరంజీవి.

ఇది కూడా చ‌ద‌వండి :  Pawan Kalyan : పవన్ కళ్యాణ్ వీరమల్లు మళ్లీ వాయిదానా.. పాపం నిర్మాతల పరిస్థితి ఏంటో..?

మెగా ఫ్యామిలీలో పవన్ కళ్యాణ్ ఒక్కడు మిస్ అయ్యాడు కానీ అంజనమ్మతో ఈ స్పెషల్ ఇంటర్యూలో చిరంజీవి, నాగబాబు వారి సోదరీమణులు పాల్గొనడం మెగా ఫ్యాన్స్ కు స్పెషల్ ట్రీట్ అందించింది. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూకి సంబందించిన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఐతే ఈ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ కూడా ఉంటే బాగుండేదని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఉమెన్స్ డే నాడు మెగా ఫ్యాన్స్ కి ఈ స్పెషల్ సర్ ప్రైజ్ ఇంటర్వ్యూ వాళ్లని ఖుషి చేస్తుంది.

Advertisement