Kamareddy | అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యుల అరెస్ట్
Kamareddy | అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యుల అరెస్ట్
Advertisement

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యుల్లో ఇద్దరిని అరెస్ట్ చేశామని పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం పట్టణ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా నర్సి పట్టణానికి చెందిన షేక్ ఇమ్రాన్ ఇస్మాయిల్, షేక్ వాజిద్ అనే ఇద్దరు వ్యక్తులు మూడేళ్ల నుంచి కామారెడ్డి పట్టణంతో పాటు దేవుని​పల్లి ఏరియాల్లో ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతున్నారన్నారు. చోరీ చేసిన సొత్తుని దెగ్లూర్ ఏరియాలో వ్యక్తులకు విక్రయించారని, సుమారుగా 30-40 ఇళ్లల్లో తాళాలు పగులగొట్టి చోరీలకు చేసినట్టుగా విచారణలో ఒప్పుకున్నారని వివరించారు. శనివారం ఉదయం కామారెడ్డికి చోరీలు చేసేందుకు వచ్చిన వీరిని వలపన్ని పట్టుకున్నామని తెలిపారు. దొంగతనం చేసిన ఆభరణాల రికవరీ, తదుపరి విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామన్నారు. వీరిని పట్టుకోవడంలో కృషి చేసిన సిబ్బందిని ఎస్పీ, ఏఎస్పీ అభినందించారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  Nizamabad | చోరీలు, చైన్​ స్నాచింగ్​ల​ కేసుల్లో అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్‌..