అక్షరటుడే, వెబ్‌డెస్క్ : యువ హీరో కిరణ్ అబ్బవరం వరుస సినిమాలతో అదరగొట్టేస్తున్నాడు. క ముందు వరకు కాస్త తడపడిన ఈ హీరో క తో సూపర్ హిట్ కొట్టి సత్తా చాటడంతో మళ్లీ ట్రాక్ లోకి వచ్చాడు. ఇక త్వరలో దిల్ రూబా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మార్చి 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమాలో కిరణ్ సరన రుక్సర్ థిల్లర్ హీరోయిన్ గా నటిస్తుంది.
ఐతే ఈ సీనిమా ప్రమోషన్స్ లో తన కెరీర్ గురించి చెప్పుకొచ్చాడు కిరణ్ అబ్బవరం. క ముందు వరకు ఒకలా ఉన్న తను ఆ సినిమా తర్వాత థింకింగ్ మారిపోయింది. అంతేకాదు మొహమాటానికి కూడా పోయి కూడా కొన్ని కథలు ఒప్పుకున్నట్టు చెప్పాడు కిరణ్ అబ్బవరం. ఇక దిల్ రూబా సినిమా అందరి ఆడియన్స్ కి నచ్చేస్తుందని అన్నారు.
సినిమాల్లోకి రాకపోతే రాజకీయాల్లోకి వెళ్లే వాడిని..
ఒకవేళ సినిమాల్లోకి రాకపోతే తప్పకుండా రాజకీయాల్లోకి వెళ్లే వాడినని అన్నారు కిరణ్ అబ్బవరం. ప్రజలతో మమేకం అవ్వడం ఇష్టమని అందుకే రాజకీయాల మీద ఆసక్తి ఉందని అన్నారు. సినిమా హీరో కాకపోతే కచ్చితంగా రాజకీయాల్లోకి వెళ్లేవాడినని అన్నారు. ఇక కిరణ్ అబ్బవరం కి ఫుడ్ బిజినెస్ చేయాలని కూడా ఉందని చెప్పారు. ఆల్రెడీ దానికి సంబందించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని వెల్లడించారు. రాయలసీమ రుచులను అందరికీ తెలిసేలా తన ఫుడ్ బిజినెస్ ఉంటుందని అన్నారు కిరణ్ అబ్బవరం.
సో కుర్ర హీరో ప్లానింగ్ పర్ఫెక్ట్ గా ఉందని అనిపిస్తుంది. కెరీర్ లో మంచి ఫాం లో ఉన్నప్పుడే వచ్చిన డబ్బుని ఏం చేయాలి అన్న క్లారిటీతో ఉన్నాడు. హీరోగా సక్సెస్ అవ్వడమే కాదు జీవితంలో కూడా సక్సెస్ అయ్యేలా తన ప్లానింగ్ చేసుకుంటున్నాడు కిరణ్ అబ్బవరం. పెళ్లి తర్వాత లైఫ్ ఇంకా సంతోషంగా ఉందని అన్నారు కిరణ్ అబ్బవరం. దిల్ రూబా సినిమా మార్చి 14 హోలీ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. రిలీజైన ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది.