అక్షరటుడే, వెబ్డెస్క్: Medical camp : వనస్థలిపురం ఎన్జీఓస్ కాలనీలోని కాపు భవన్ లో పీస్ వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపకులు డాక్టర్ బొగ్గు సురేష్ ఆధ్వర్యంలో శనివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. కాపు, తెలగ, బలిజ, ఒంటరి సంఘం సౌజన్యంతో ఏర్పాటు చేసిన శిబిరంలో బీపీ, షుగర్, నేత్ర, దంత, మానసిక ఆరోగ్య పరీక్షలు జరిపారు. ఉచితంగా మందులు అందజేయడం తో పాటు కళ్లద్దాలు పంపిణీ చేశారు. అవసరమైన వారికి శస్త్ర చికిత్సలకు సిఫారసు చేశారు. 180 మంది సేవలు వినియోగించుకున్నారు. ప్రతి నెల రెండో శనివారం ఉచిత విద్య శిబిరం నిర్వహించనున్నట్లు డాక్టర్ సురేష్ తెలిపారు. కోటి మందికి కంటి పరీక్షలు, లక్ష మందికి శస్త్రచికిత్సలు లక్ష్యంగా శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ అవకాశాన్ని పేదలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కాపు , బలిజ, తెలగ, ఒంటరి సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఐ ఎస్ కోటేశ్వర రావు, ఎం.పున్నయ్య, కార్యవర్గ సభ్యులు సుబ్బరాయన్, శ్రీనివాస్, ఆంజనేయులు, రత్నారావు తదితరులు పాల్గొన్నారు.
Medical camp | ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన
Advertisement
Advertisement