Naga Babu : చిరంజీవి, ప‌వ‌న్‌కి నాగబాబు ఎంత అప్పు ఉన్నారో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

Naga Babu : చిరంజీవి, ప‌వ‌న్‌కి నాగబాబు ఎంత అప్పు ఉన్నారో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!
Naga Babu : చిరంజీవి, ప‌వ‌న్‌కి నాగబాబు ఎంత అప్పు ఉన్నారో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!
Advertisement

అక్ష‌ర‌టుడే, వెబ్‌డెస్క్‌ Naga Babu : మెగా బ్ర‌ద‌ర్స్ చిరంజీవి, పవ‌న్ క‌ళ్యాణ్, నాగ‌బాబు ఎంతో ఆత్మీయంగా ఉంటారు. వీరి ముగ్గురిలో ప‌వ‌న్, చిరంజీవి మంచి స్థాయిలో ఉండ‌గా, నాగ‌బాబు మాత్రం మిడిల్‌లో ఉన్నాడు. ప‌లు సంద‌ర్భాల‌లో ఆయ‌న చాలా స‌మ‌స్య‌లు కూడా ఎదుర్కొన్నాడు. అప్పులు చేసి వాటిని తీర్చ‌లేక కూడా ఇబ్బంది ప‌డ్డాడు. అప్పుడు చిరంజీవి, ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇద్ద‌రే నాగబాబుని ఆదుకున్నార‌ని స‌మాచారం. అయితే కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా జనసేన పార్టీ నేత కొణిదల నాగేంద్రరావు (నాగబాబు) ఇటీవ‌ల నామినేష‌న్ దాఖ‌లు చేసిన విష‌యం తెలిసిందే.

Naga Babu : అంత అప్పు చేశారా..

ఈ నేప‌థ్యంలో ఆయ‌న ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌లో నాగబాబు తన ఆస్తులు, అప్పుల వివరాలను వెల్లడించారు. 70 కోట్ల రూపాయల ఆస్తులను ప్రకటించిన నాగబాబు.. తనపై ఎలాంటి క్రిమినల్‌ కేసులూ లేవని తెలియ‌జేశారు. చిరంజీవి, పవన్ దగ్గర నాగబాబు అప్పు తీసుకున్నట్టు ఆయ‌న ప్ర‌క‌టించ‌డం ఆస‌క్తి రేపుతుంది. నాగ‌బాబు చరాస్తుల విలువ 59 కోట్లు కాగా, నాగబాబు దగ్గర బాండ్లు, మ్యూచువల్ ఫండ్స్, నగదు కలిపి 59 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్/బాండ్లు – రూ.55.37 కోట్లు, చేతిలో నగదు – రూ.21.81 లక్షలు, బ్యాంకు నిల్వలు – రూ.23.53 లక్షలు ఉన్నాయి.

ఇది కూడా చ‌ద‌వండి :  Renu Desai : ప‌వ‌న్ క‌ళ్యాణ్ రియ‌ల్ క్యారెక్ట‌ర్ ఇదే.. రేణూ దేశాయ్ బ‌య‌ట పెట్టిన సీక్రెట్స్

ఇతరులకు ఇచ్చిన అప్పులు – రూ.1.03 కోట్లు, బెంజ్ కారు –రూ.67.28 లక్షలు, హ్యుందాయ్ కారు – రూ.11.04 లక్షలు, బంగారం & వెండి – రూ.57.99 లక్షల విలువైన 724 గ్రాముల బంగారం, భార్య వద్ద 55 క్యారట్ల వజ్రాలు (రూ.16.50 లక్షలు), 20 కేజీల వెండి (రూ.21.40 లక్షలు), హైదరాబాద్ పరిసరాల్లో 11 కోట్ల స్థిరాస్తులు, రంగారెడ్డి జిల్లాలో 2.39 ఎకరాల భూమి – రూ.5.3 కోట్లు, మెదక్ జిల్లా నర్సాపూర్‌లో 8.28 ఎకరాల భూమి – రూ.82.80 లక్షలు, రంగారెడ్డి జిల్లా టేకులాపల్లిలో 1.07 ఎకరాల భూమి – రూ.53.50 లక్షలు, హైదరాబాద్ మణికొండలో విల్లా – రూ.2.88 కోట్లు, మొత్తం స్థిరాస్తుల విలువ – రూ.11.20 కోట్లుగా తెలియజేశారు. ఇక అఫిడ‌విట్‌లో చిరంజీవి దగ్గర రూ.28.48 లక్షలు అప్పు, పవన్ కల్యాణ్ దగ్గర రూ.6.90 లక్షలు అప్పు తీసుకున్నట్లు నాగబాబు ప్రకటించారు. ఈ విష‌యం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Advertisement