మైనార్టీలను మోసం చేసిందే కాంగ్రెస్

0

ఎంపీ అర్వింద్ ను ఓడిస్తాం: కవిత

అక్షరటుడే, వెబ్ డెస్క్: కాంగ్రెస్ పార్టీ మైనార్టీలను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకుందని, తమ ప్రభుత్వం మాత్రం వారికి అన్ని విధాలుగా అండగా నిలిచిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. నిజామాబాద్ లో గురువారం ఆమె మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడుతూ.. దేశం గర్వించే పథకాలను ప్రవేశపెట్టిందే సీఎం కేసిఆర్ అని, మేనిఫెస్టోను తాము కాపీ కొట్టామంటూ కాంగ్రెస్ నేతలు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ ఎన్నికలను ఓ ఆటగా భావిస్తుందని, తాము రాష్ట్ర ప్రజల భ్యవిషత్తు కోసం ఎన్నికలకు వెళ్తున్నామన్నారు. ఎంపీ అర్వింద్ ఎక్కడి నుంచి పోటీ చేసినా ఓడిస్తామని, ఇందుకోసం కోరుట్ల కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కామారెడ్డిలో మాస్టర్ ప్లాన్ ను ఎప్పుడో ఆపివేశామని, రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రజలు వర్గాలు, మతాల వారీగా చీలిపోవద్దని విజ్ఞప్తి చేశారు. రైతుబంధుతో పాటు అన్ని పథకాలు ఆపాలని కాంగ్రెస్ నేతలు అంటున్నారని..వారికి అధికారం ఇస్తే రాష్ట్రాన్ని నాశనం చేస్తారని పేర్కొన్నారు. గల్ఫ్ కార్మికులకు తమ ప్రభుత్వం అండగా ఉందని, కేసిఆర్ భీమాతో వారికి లబ్ధి జరుగుతుందన్నారు.