NTR : లాస్ట్ ఇయర్ దేవర 1 తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎన్టీఆర్ ఈ ఇయర్ వార్ 2 తో రాబోతున్నాడు. ఈమధ్యనే ప్రశాంత్ నీల్ తో సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లాడు ఎన్టీఆర్. ఐతే ఈ ఇయర్ తెలుగు ఆడియన్స్ కి కూడా వార్ 2 ఒక్కటే ఖుషి చేయనుంది. తెలుగులో క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఎన్టీఆర్ మొదటిసారి హిందీలో చేస్తున్న సినిమా వార్ 2. అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్నాడు.
తెలుస్తున్న సమాచారం మేరకు వార్ 2 లో ఎన్టీఆర్ నెగిటివ్ రోల్ అని అంటున్నారు. ఐతే వార్ 2 సినిమాలో ఎన్టీఆర్ ఎలాంటి రోల్ చేసినా అదరగొట్టేయడం పక్కా అని ఆయన ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. వార్ 2 సినిమాలో కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది. ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వార్ 2 వస్తుంది. వార్ సినిమా సూపర్ హిట్ కాగా సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేసిన ఆ సినిమా ప్రేక్షకులను అలరించింది.
NTR : ఎన్టీఆర్ నటించడం స్పెషల్ ఎట్రాక్షన్..
ఇక ఇప్పుడు వార్ 2 ని దానికి మించి ఉండేలా తెరకెక్కిస్తున్నారు. వార్ 2 సినిమాలో ఎన్టీఆర్ నటించడం స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. అందుకే సినిమాలో ఎన్టీఆర్ రోల్ మీద కూడా స్పెషల్ ఫోకస్ చేస్తున్నారట మేకర్స్. ఐతే ఈ ఇయర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి వార్ 2 ఒక్కటే రాబోతుంది. ఈ సినిమాను ఈ ఇయర్ ఆగష్టు 14న రిలీజ్ లాక్ చేశారు. టీ సీరీస్ ఈ సినిమా ప్రమోషన్స్ ని కూడా భారీగా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.
ఎన్టీఆర్ ఉన్నాడు కాబట్టి సౌత్‌లో కూడా వార్ 2 కి భారీ ప్రమోషన్స్ చేసి ఇక్కడ కూడా భారీ రిలీజ్ అయ్యేలా చూస్తున్నారు. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజన్స్ సినిమాకే హైలెట్ గా నిలుస్తుందని అంటున్నారు. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.