CYBER | సైబర్ నేరగాళ్లతో జాగ్రత్త..!
CYBER | సైబర్ నేరగాళ్లతో జాగ్రత్త..!
Advertisement

అక్షరటుడే నిజాంసాగర్: CYBER | పెద్దకొగప్​గల్​ మండల కేంద్రంలో ఆదివారం స్థానిక పోలీసులు ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి బ్యాంకు ఖాతా నంబరు, ఆధార్ తదితర వివరాలు అడిగితే సమాచారం ఇవ్వొద్దన్నారు. ప్రజలు బైక్​లు నడిపే సమయంలో కచ్చితంగా హెల్మెట్లను ధరించాలని సూచించారు. మద్యం మత్తులో వాహనాలు నడపవద్దని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్​ సిబ్బంది సాయి శివ, అంజి, జైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement