అక్షరటుడే, వెబ్‌డెస్క్: Mlc candidates | తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. రాష్ట్రంలో ఉన్న నాలుగు స్థానాల్లో ఒక స్థానాన్ని అధినాయకత్వం సీపీఐకి కేటాయించింది. మిగిలిన మూడు స్థానాల్లో అభ్యర్థులుగా సినీ నటి, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్‌ను ఖరారు చేశారు. ఈ మేరకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆదివారం ప్రకటన విడుదల చేశారు.
కాగా.. ఎమ్మెల్సీ టికెట్ కోసం పలువురు సీనియర్ నేతలు ప్రయత్నాలు చేశారు. ఇందుకోసం ఢిల్లీ నేతలను సైతం ప్రసన్నం చేసుకున్నారు. సీఎం రేవంత్ సూచించిన వారితో పాటు పార్టీ కోసం ఏళ్లుగా కష్టపడిన వారి వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.