champions trophy | ఇండియా వ‌ర్సెస్ న్యూజిలాండ్ ఫైన‌ల్‌కి భారీ వ్యూయర్​షిప్​.. ఏకంగా 81 కోట్ల‌కి పైగా వ్యూస్

champions trophy | ఇండియా వ‌ర్సెస్ న్యూజిలాండ్ ఫైన‌ల్‌కి భారీ వ్యూస్.. ఏకంగా 81 కోట్ల‌కి పైగా వ్యూస్
champions trophy | ఇండియా వ‌ర్సెస్ న్యూజిలాండ్ ఫైన‌ల్‌కి భారీ వ్యూస్.. ఏకంగా 81 కోట్ల‌కి పైగా వ్యూస్
Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్​: champions trophy | 2025 ఛాంపియన్స్ ట్రోఫీని ఎవ‌రు ముద్దాడుతారా అని ప్ర‌తి ఒక్క‌రు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తూ వ‌చ్చారు. ఎట్ట‌కేల‌కి న్యూజిలాండ్‌ని ఓడించి భార‌త్ క‌ప్ ఎగ‌రేసుకుపోయింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో, భారత జట్టు 9 నెలల్లో రెండవ ట్రోఫీని ముద్ధాడ‌డం గ‌మ‌న‌ర్హం. 2024 టీ20 ప్రపంచ కప్ టైటిల్ గెలిచిన తర్వాత, రోహిత్ శ‌ర్మ కెప్టెన్సీలో టీం ఇండియా 12 సంవత్సరాల తర్వాత మళ్లీ ఛాంపియన్స్ ట్రోఫీని ద‌క్కించుకుంది. భార‌త్‌కి రెండు ఐసీసీ ట్రోఫీలు అందించి పెట్టిన రోహిత్ శ‌ర్మ‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తుంది.

champions trophy | ఏంటా వ్యూస్..

ఇక మార్చి 9వ తేదీ ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఫైనల్‌లో భారత బౌల‌ర్ల అద్భుతమైన బౌలింగ్, కెప్టెన్ రోహిత్ శర్మ బలమైన ఇన్నింగ్స్ టీమ్ ఇండియా విజ‌యానికి దోహ‌ద ప‌డింది. బ‌లంగా ఉన్న భార‌త్ జ‌ట్టు న్యూజిలాండ్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించింది. దీంతో, 25 ఏళ్ల క్రితం ఇదే టోర్నమెంట్ ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఎదురైన ఓటమికి టీం ఇండియా ప్రతీకారం తీర్చుకున్నట్టు అయింది. ఈ క్ర‌మంలో భార‌త్ మూడోసారి ఛాంపియన్స్ ట్రోపీ గెలిచింది.2 002లొ ఛాంపియన్స్ ట్రోపీని భారత్-శ్రీలంక సంయుక్తంగా గెలిచాయి. 2013లో రెండోసారి ఛాంపియన్స్ ట్రోపీ గెలిచిన టీమిండియా 2025లో న్యూజిలాండ్‌పై గెలిచి ఛాంపియన్స్ ట్రోపీ కైవసం చేసుకుంది.

ఇది కూడా చ‌ద‌వండి :  Champions Trophy | తొలి వికెట్​ కోల్పోయిన న్యూజిలాండ్​ జట్టు

 

అయితే ఫైన‌ల్‌లో టీమిండియా ఆడుతుంది అంటే ఆద‌ర‌ణ ఏ రేంజ్‌లో ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆదివారం కావ‌డంతో అంద‌రు ముందుగానే అన్ని ఏర్పాట్లు చేసుకొని మ్యాచ్‌ని వీక్షించారు. ఈ క్ర‌మంలో జియో హాట్ స్టార్‌లో ఏకంగా 81 కోట్ల‌కి పైగా రికార్డ్ వ్యూస్ న‌మోదు అయ్యాయి. ఇన్ని కోట్ల వ్యూస్ రావ‌డం జియో వ‌ర్గాల‌ని కూడా ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. ఈ క్ర‌మంలో జియో హాట్ స్టార్‌కి వంద‌ల కోట్ల ఆదాయం రావ‌డం ప‌క్కా అని కూడా అంచ‌నాలు వేస్తున్నారు. మొత్తానికి ఛాంపియ‌న్స్ ట్రోఫీ ఫైన‌ల్ జియో హాట్ స్టార్‌కి పంట పండేలా చేసింది.

Advertisement