
అక్షరటుడే, వెబ్‌డెస్క్ Suma – Rajeev Kanakala : యాంకర్ సుమ, నటుడు రాజీవ్ కనకాల ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరు ఎంతో అన్యోన్యంగా ఉంటూ వస్తున్నారు. వీరి వైవాహిక జీవితంలో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. సుమ అయితే సందర్భం వచ్చినప్పుడల్లా తన పతిని కలవరిస్తూనే ఉంటుంది. కానీ మధ్యలో సుమ-రాజీవ్ విడిపోతున్నారంటూ జోరుగా పుకార్లు పుట్టించారు. కాస్త మసాలా ఏమీ లేదు అన్నప్పుడల్లా.. సోషల్ మీడియాలో ఇలాంటి పుకార్లకు తెరరేపుతూ వస్తూనే ఉన్నారు. అయితే ఐదేళ్లుగా ఈ పుకార్లపై స్పందిస్తూనే ఉన్నారు రాజీవ్ కనకాల, సుమలు.
Suma – Rajeev Kanakala : క్యూట్ కపుల్..
ఓ సందర్భంలో అయితే రాజీవ్ కనకాల ఫుల్ ఎమోషనల్ అవుతూ.. ఇలాంటి రూమర్స్.. మా అమ్మ నాన్నలు బతికి ఉన్నప్పుడు వచ్చి ఉంటే.. ఎంత బాధపడిపోయేవారు. వాళ్లు పోయారు కాబట్టి పర్లేదు. కానీ మాకంటూ ఫ్యామిలీ ఉంది కదా.. బాబాయ్‌లు పిన్నిలూ మిగిలిన బంధువులంతా ఊర్లలో ఉన్నారు. వాళ్లకి ఇలాంటి వార్తలు తెలిసినప్పుడు.. ఏంటి ఈ విషయాలు మాకు ఎందుకు చెప్పడం లేదని కంగారు పడి ఫోన్లు చేస్తున్నారు. ఏమైంది? మాట్లాడుకుందామా? ఏమైనా చేయాలా? అని అడుగుతుంటే అలాంటిది ఏం కాలేదండీ అని చెప్పడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఫ్రెండ్స్‌తో అయితే అలాంటిదేం లేదని కొట్టిపారేసేయొచ్చు. కానీ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర ఇలాంటి విషయాలు చెప్పాలంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుందని రాజీవ్ అన్నారు.
పుకార్లకి ఎప్పటికప్పుడు ఫుల్ స్టాప్ పెట్టడానికి సుమ, రాజీవ్‌లు ఈ మధ్య పలు టీవీ షోలలో అలా మెరుస్తూ వస్తున్నారు. ఆహా ఓటీటీలో సరికొత్త షో చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ K ఇటీవల మొదలు కాగా, ఇందులో సుమ యాంకరింగ్ తో, జీవన్ కుమార్ జడ్జిగా ఫుల్ కామెడీతో ఈ షోని నడిపిస్తున్నారు. తాజాగా ఈ షో రెండో ఎపిసోడ్ కి రాజీవ్ కనకాల గెస్ట్‌గా వచ్చాడు. ఇక సుమ – రాజీవ్ ల 26వ వెడ్డింగ్ యానివర్సరీ కావడంతో కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ చేశారు. ఈ జంట క్యూట్ గా ఉందని, ఇప్పటికే కాదు ఎప్పటికీ ఇంతే అన్యోన్యంగా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు.