అక్షరటుడే, వెబ్‌డెస్క్ JR NTR : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా ముగింపు దశకు చేరుకోగా ఆ నెక్స్ట్ ప్రశాంత్ నీల్‌తో సినిమాను ఈ మధ్యనే సెట్స్ మీదకు తీసుకెళ్లాడు. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ చేయబోయే సినిమా గురించి కూడా ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎన్టీఆర్ డ్రాగన్ తర్వాత కోలీవుడ్ స్టార్ డైరెక్టర్‌తో సినిమాకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.
ఇంతకీ ఎన్టీఆర్‌ను డైరెక్ట్ చేసే ఆ తమిళ దర్శకుడు ఎవరంటే నెల్సన్ దిలీప్ కుమార్ అని తెలుస్తోంది. సూపర్ స్టార్ రజినీకి జైలర్ లాంటి సూపర్ హిట్ సినిమా ఇచ్చిన నెల్సన్ ప్రస్తుతం రజినీతో జైలర్ 2 చేస్తున్నాడు. రజినీ ‘కూలీ’ సినిమా పూర్తి కాగానే జైలర్ 2 కోసం పూర్తి స్థాయి డేట్స్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఇక జైలర్ 2 ఫినిష్ కాగానే ఎన్టీఆర్ సినిమాకు నెల్సన్ వర్క్ మొదలు పెడతాడు. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ నాగ వంశీ నిర్మిస్తారని తెలుస్తుంది.
JR NTR : ఫ్యాన్స్ లో సూపర్ ఎగ్జైట్ మెంట్..
నెల్సన్ ఇప్పటికే ఎన్టీఆర్‌తో తీసే లైన్ చెప్పగా హీరో, ప్రొడ్యూసర్ ఓకే అన్నారట. ఐతే ఫైనల్ స్క్రిప్ట్ మరోసారి వినాల్సి ఉందని తెలుస్తుంది. నెల్సన్ దిలీప్ కుమార్‌తో ఎన్టీఆర్ సినిమా అనగానే ఫ్యాన్స్‌లో సూపర్ ఎగ్జైట్ మెంట్ మొదలైంది. ముఖ్యంగా ఫ్యాన్స్ అయితే మరోసారి ఎన్టీఆర్ నుంచి ఊర మాస్ సినిమా ఆశిస్తున్నారు. ఆర్ఆర్ఆర్తో గ్లోబల్ రేంజ్ క్రేజ్ తెచ్చుకున్న తారక్ ప్రస్తుతం వార్ 2 అంటూ పాన్ ఇండియా అటెంప్ట్ చేస్తున్నాడు.
ప్రశాంత్ నీల్‌తో వస్తున్న డ్రాగన్ కూడా భారీ రేంజ్లో వస్తోంది. ఇక ఆ తర్వాత నెల్సన్‌తో చేసే సినిమా అయితే నెక్స్ట్ లెవెల్లో ఉండబోతోంది. తప్పకుండా ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి ఈ సినిమాలు ఫుల్ ఫీస్ట్ అందించేలా ఉంటాయని అంచనా వేస్తున్నారు.