Hyderabad Weather : వేసవి కాలం వచ్చేసింది. అంతటా భానుడి భగ భగతో ప్రజలు అల్లాడిపోతున్నారు. అయితే హైదరాబాద్ నగరవాసులు రాత్రిపూట చలితో ఇబ్బంది పడుతున్నారు. రానురాను ఎండలు మరింత పెరిగే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో పగలు 35.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవగా, పటాన్‌చెరు ప్రాంతంలో రాత్రిపూట అత్యల్పంగా కనిష్ఠ ఉషోగ్రతలు 10.2, రాజేంద్రనగర్‌లో 11 డిగ్రీలు నమోదయ్యాయి. రాత్రి సమయంలో ఉత్తర, ఈశాన్య దిశగా వీస్తున్న గాలుల ప్రభావంతో పలు ప్రాంతాల్లో 10-16 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
Hyderabad Weather : జాగ్రత్త పడండి..
పలు జిల్లాల్లో గరిష్ఠంగా 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు మధ్యాహ్నం వేళ బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఉక్కపోతతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.అయితే మార్చి 12 వరకు హైదరాబాద్‌లో కాస్త ఉష్ణోగత్రలు తగ్గుముఖం పడతాయని తెలుస్తుంది. ఈ రెండు రోజులు హైదరాబాద్‌లో మంచి వాతావరణాన్ని ఎంజాయ్ చేసే అవకాశం ఉంది. ఇక మార్చి 12 తర్వాత ఎండలు మండే అవకాశం ఉంది. ఈ రోజు హైదరాబాద్‌లో గరిష్ట ఉష్ణోగ్రత 34.85 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 20.16 డిగ్రీల సెల్సియస్.
బుధవారం గరిష్ట ఉష్ణోగ్రత 36.67 డిగ్రీలు ఉండే అవకాశం ఉంది. గురువారం 38.1 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండే అవకాశం ఉంది. శుక్ర, శనివారాలలో 38 డిగ్రీల ఉష్ణోగ్రతకి పైన పెరిగే ఛాన్స్ ఉంది. మరికొన్ని నివేదికల ప్రకారం కూకట్ పల్లి, హయత్ నగర్, నాగోల్ వంటి ప్రాంతాలలో ఉష్ణోగ్రత 25 డిగ్రీల లోపే ఉంటుందని అంటున్నారు. ఏది ఏమైన రానున్న రోజులలో ఎండలు మండిపోనున్నాయి. అందుకే హైదరాబాద్ వాతావరణాన్ని ఎంజాయ్ చేయాలని అనుకున్న వారికి మార్చి 12 వరకు కరెక్ట్ టైం అని అంటున్నారు.