Nizamabad CP | అక్రమార్కులపై ఉక్కుపాదం మోపుతాం: సీపీ

Nizamabad CP | అక్రమార్కులపై ఉక్కుపాదం మోపుతాం: సీపీ
Nizamabad CP | అక్రమార్కులపై ఉక్కుపాదం మోపుతాం: సీపీ
Advertisement

అక్షరటుడే, ఇందూరు: CP Sai Chaitanya | కమిషనరేట్​ పరిధిలో అక్రమార్కులపై ఉక్కుపాదం మోపుతామని సీపీ సాయి చైతన్య స్పష్టం చేశారు. ఆయన సోమవారం నిజామాబాద్ సీపీగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పోలీసులు అధికారులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

 

అనంతరం సీపీ మాట్లాడుతూ.. జిల్లాలో ఇసుక అక్రమ రవాణా, గంజాయి, మట్కా నియంత్రణకు కఠినంగా వ్యవహరిస్తామని పేర్కొన్నారు. జిల్లాకు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు సరిహద్దు కావడంతో మరింత అప్రమత్తంగా ఉంటామని తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణకు మొదటి ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు.

ఇది కూడా చ‌ద‌వండి :  Nizamabad CP | పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలి: సీపీ

CP Sai Chaitanya | సైబర్​ నేరాలపై ప్రత్యేక దృష్టి

సైబర్ నేరాలు ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో కూడా జరుగుతున్నాయని కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. వాటిపై ఒక బృందంగా ఏర్పడి ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పారు. లా అండ్ ఆర్డర్​పై వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఉన్న డయల్ 100కు కాల్ చేయాలని సూచించారు. మహిళల భద్రతకు పెద్దపీట వేస్తామని పేర్కొన్నారు.

Advertisement