అక్షరటుడే, కోటగిరి: Kotagiri | రంజాన్ సందర్భంగా సోమవారం మండల కేంద్రంలో జుబేర్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యవసాయ సలహాదారుడు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి(pocharam srinivas reddy) పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనలో ముస్లింలతో కలిసి విందు స్వీకరించారు. రంజాన్ మాసం ఎంతో పవిత్రమైనదని, ముస్లింలు ఉపవాసాలు ఉంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గైక్వాడ్ హన్మంత్, మాజీ జడ్పీటీసీ శంకర్ పటేల్, పార్టీ అధ్యక్షుడు షాహిద్ హుస్సేన్, ఏఎంసీ మాజీ చైర్మన్ అబ్దుల్ హమీద్, మనోహర్, సిరాజుద్దీన్, మధు, బాబు ఖాన్, తదితరులు పాల్గొన్నారు.