Inspector Transfers | రాష్ట్రంలో పలువురు సీఐల బదిలీ

Transfers | పలువురు సీఐల బదిలీ
Transfers | పలువురు సీఐల బదిలీ
Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్​: రాష్ట్రంలో పలువురు సీఐలు బదిలీ అయ్యారు. మల్టీజోన్​–1(multi zone-1) పరిధిలో 14 మంది ఇన్​స్పెక్టర్లను(ci transfers) బదిలీ చేశారు. ఈ మేరకు ఐజీ చంద్రశేఖర్​ రెడ్డి(IG Chandra Shekhar Reddy) సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

 

వీరిలో ఎక్కువ మంది ఐజీ కార్యాలయంలో వెయిటింగ్​, లూప్​లైన్​ పోస్టింగులో వారే ఉన్నారు. అలాగే చెన్నూర్​ ఎస్​హెచ్​వో రవీందర్ పై బదిలీ వేటు వేశారు. నిర్మల్​ రూరల్​ సర్కిల్​ ఇన్​స్పెక్టర్​గా మున్నూరు కృష్ణను నియమించారు. అతి త్వరలో మరికొంత మంది సీఐలు బదిలీ అయ్యే అవకాశాలున్నాయి. ఇటీవల పలు జిల్లాలకు కొత్త పోలీస్​ బాస్​లను నియమించిన నేపథ్యంలో వారిచ్చే నివేదిక ఆధారంగా ప్రస్తుతం వివిధ సర్కిల్​ పోస్టింగుల్లో కొనసాగుతున్న వారిపై బదిలీ వేటు వేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

Advertisement