
అక్షరటుడే, వెబ్‌డెస్క్ Hackable Passwords : ఇది డిజిటల్ యుగం. అరచేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. ప్రపంచమంతా మన చేతుల్లో ఉన్నట్టే. పొద్దున లేస్తే మనమంతా టెక్నాలజీ మీదనే ఆధారపడుతున్నాం. ఉదయం లేవగానే స్మార్ట్ ఫోన్ చేతుల్లో ఉండాల్సిందే. సోషల్ మీడియా అకౌంట్లు, ఈమెయిల్స్, వాట్సప్, బ్యాంక్ అకౌంట్లు, పేమెంట్ యాప్స్, యూపీఐ పేమెంట్స్ ఇవే కదా మనం రోజూ చేసే పని. కానీ.. వీటి వెనుక చాప కింద నీరులా సైబర్ క్రిమినల్స్ కూడా రెచ్చిపోతున్నారు. మన డిజిటల్ డేటాను దొంగిలించి బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేస్తున్నారు.
మీరు సోషల్ మీడియాకు ఏ పాస్ వర్డ్ పెట్టినా ఇట్టే కనిపెట్టేస్తున్నారు. నెట్ బ్యాంకింగ్ ను ఎంత స్ట్రాంగ్ గా చేసుకున్నా, దాన్ని ఈజీగా హ్యాక్ చేసి డబ్బులు కొట్టేస్తున్నారు. దానికి కారణం చాలామంది చాలా సులభతరమైన, సింపుల్ పాస్ వర్డ్స్ పెట్టుకోవడమే. నిజానికి మన డేటా అనేది సోషల్ మీడియాలో పబ్లిక్ లో ఉన్నట్టే లెక్క. సోషల్ మీడియాలో మన డేటాను మనమే ఎక్స్పోజ్ చేస్తున్నాం. అలా మనకు చెందిన సెన్సిటివ్ డేటాను సైబర్ నేరగాళ్లు సేకరించి సైబర్ దాడులకు పాల్పడుతున్నారు.
Hackable Passwords : హ్యాక్‌కు గురయ్యే పాస్‌వర్డ్స్‌నే వాడుతున్నామా?
ఇటీవల నార్డ్ వీపీఎన్ అనే ఓ సంస్థ ఒక సర్వే నిర్వహించింది. ఆ సర్వే ప్రకారం చాలామంది తమ సోషల్ మీడియా అకౌంట్లకు, నెట్ బ్యాంకింగ్ అకౌంట్లకు, ఇతర అకౌంట్లకు సులభంగా హ్యాక్‌కు గురయ్యే పాస్‌వర్డ్స్‌ను వాడుతున్నారట. అలాంటి వీక్ పాస్‌వర్డ్స్‌ను వాడటం వల్ల ఆ డేటా హ్యాకర్ల చేతుల్లోకి వెళ్తోందంటున్నారు. ఉదాహరణకు 123456 లాంటి సులభంగా గెస్ చేయగలిగిన పాస్ వర్డ్ ను కొన్ని కోట్ల మంది ఉపయోగిస్తున్నారట.
అలాంటి ఈజీ పాస్ వర్డ్స్ కాకుండా స్ట్రాంగ్ పాస్ వర్డ్స్ ను వాడాలి. అలాగే.. ప్రతి అకౌంట్ కు రకరకాల పాస్ వర్డ్స్ పెట్టుకోవాలి. రెగ్యులర్ గా మార్చుతూ ఉండాలి. అలాగే.. టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ కూడా పెట్టుకోవాలి. వీలైతే పాస్ వర్డ్ మేనేజర్ యాప్స్ వాడి స్ట్రాంగ్ పాస్ వర్డ్స్ పెట్టుకుంటే మీ పాస్ వర్డ్ హ్యాక్ కాకుండా కాపాడుకోవచ్చు.