Cyber Attack | ‘ఎక్స్‌’పై సైబర్ అటాక్​ జరిగిందా.. మస్క్​ ఏమన్నారంటే?

Cyber Attack | 'ఎక్స్‌'పై సైబర్ అటాక్​ జరిగిందా.. మస్క్​ ఏమన్నారంటే?
Cyber Attack | 'ఎక్స్‌'పై సైబర్ అటాక్​ జరిగిందా.. మస్క్​ ఏమన్నారంటే?
Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Cyber Attack | సోషల్​ మీడియా వేదిక ‘ఎక్స్​’పై సైబర్​ దాడి జరిగినట్లు దాని యజమాని, ప్రపంచ కుబేరుడు ఎలన్​ మస్క్​ ఆరోపించారు. ఓ అంతర్జాతీయ మీడియా సంస్థతో ఆయన మాట్లాడుతూ ఎక్స్​ ఫ్లాట్​ఫామ్​పై సైబర్​ అటాక్​ జరగడంతో సేవల్లో అంతరాయం కలిగిందన్నారు. సోమవారం పలు దేశాల్లో ‘ఎక్స్’ సేవలకు అంతరాయం కలిగిన విషయం తెలిసిందే. నిన్న ఒక్కరోజూ దాదాపు మూడు సార్లు ‘ఎక్స్’​ పని చేయలేదు. దీంతో యూజర్లు ఇబ్బందులు పడ్డారు.

Cyber Attack | ఆ దేశం పనేనా.. ​

ఎలన్​ మస్క్​ మాట్లాడుతూ తాము నిత్యం సైబర్​ దాడికి గురవుతున్నట్లు చెప్పారు. దీని వెనక ఓ పెద్ద గ్యాంగ్​, లేదా దేశం ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. సైబర్​ దాడి చేసిన వారి ఐపీ అడ్రస్​లు మాత్రం ఉక్రెయిన్​లో ఉన్నట్లు తాము గుర్తించామన్నారు. కాగా ట్రంప్​ అధికారంలోకి వచ్చాక రష్యాతో యుద్ధం విషయంలో ఉక్రెయిన్​కు సాయం నిలిపివేశారు. ఇటీవల వైట్​ హౌస్​లో జరిగిన మీటింగ్​లోనూ ఉక్రెయిన్​ అధ్యక్షుడిని మధ్యలో నుంచే బయటకు పంపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ట్రంప్​ సన్నిహితుడు, అమెరికా ప్రభుత్వంలో కీలక స్థానంలో ఉన్న ఎలన్​ మస్క్​ సంస్థ ‘ఎక్స్’పై సైబర్​ అటాక్ జరిగింది.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  Elon Musk | పేలిన ఎలన్ మస్క్ రాకెట్​ వీడియో వైరల్​