అక్షరటుడే, వెబ్ డెస్క్ : LRS Scheme | రాష్ట్రంలో ఓపెన్ ప్లాట్లు(ఖాళీ స్థలాలు) రిజిస్ట్రేషన్లకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. సోమవారం నుంచి అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో లావాదేవీలు నిలిచిపోయాయి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ప్రక్రియకు సంబంధించిన మార్గ దర్శకాలను జారీ చేసింది. రిజిస్ట్రేషన్ కార్యాలయంలోనే(registration department) ఇందుకు సంబంధించిన ఫీజు చెల్లించి క్రమబద్ధీకరణ చేసుకోవాలని సూచించింది.
LRS Scheme | 2020లో శ్రీకారం చుట్టిన ప్రభుత్వం
2020లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పథకానికి(LRS Scheme) శ్రీకారం చుట్టింది. నాన్ లేఅవుట్ ప్లాట్ల(Non layout plots) క్రమబద్ధీకరణ కోసం నామినల్‌గా ఫీజు తీసుకుని దరఖాస్తులను స్వీకరించింది. తదనంతరం ఈ ప్రక్రియను పూర్తి చేయలేకపోయింది. కోర్టు కేసులు తదితర కారణాలతో ప్రక్రియ ఏళ్లుగా పెండింగ్‌లో పడిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది దరఖాస్తుదారులు ఈ ప్రక్రియ కోసం ఎదురుచూస్తున్న తరుణంలో తాజాగా రేవంత్‌రెడ్డి సర్కారు కీలక ప్రకటన చేసింది. ఎల్ఆర్ఎస్కు సంబంధించిన మార్గదర్శకాలను కూడా ఇచ్చింది.
LRS Scheme | రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లోనే..
ఎల్ఆర్ఎస్(LRS Scheme) కోసం దరఖాస్తు చేసుకున్న వారు తదుపరి ప్రక్రియ కోసం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోనే పూర్తి చేసుకోవాల్సి ఉంటుందని ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. రిజిస్ట్రేషన్ కార్యాలయానికి దరఖాస్తుదారు వెళ్లిన సందర్భంలో సంబంధిత ఎల్ఆర్ఎస్ వివరాలు సమర్పిస్తే ఆటోమెటిక్‌గా ఫీజు వివరాలు తెలుస్తాయి. ఇందుకు సంబంధించిన చలానా చెల్లించిన వెంటనే క్రమబద్ధీకరణ పూర్తయి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. ఈ క్రమంలోనే రిజిస్ట్రేషన్ల శాఖ సర్వర్‌ను అప్డేట్ చేసింది. ఎల్ఆర్ఎస్ స్కీం(LRS Scheme) ఫీజు ఆటోమెటిక్‌గా జనరేట్ అవుతోంది.
LRS Scheme | 25 శాతం రిబేట్
ఎల్ఆర్ఎస్ పూర్తి చేసుకునే వారికి 25 శాతం రిబేట్(25 percent rebate) ఇవ్వనున్నారు. మార్చి 31లోగా రిజిస్ట్రేషన్లను పూర్తి చేసుకున్న వారికి ఎల్ఆర్ఎస్ ఫీజులో రాయితీ వర్తించనుంది.