CHANDUR | చేపల్లో వాటా కోసం గ్రామస్తుల రాస్తారోకో
CHANDUR | చేపల్లో వాటా కోసం గ్రామస్తుల రాస్తారోకో
Advertisement

అక్షరటుడే, బాన్సువాడ: CHANDUR | చందూర్ మండలం లక్ష్మాపూర్ గ్రామానికి లక్ష్మీసాగర్ ప్రాజెక్ట్​లో చేపల్లో వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఆ గ్రామస్థులు మండల కేంద్రంలో రాస్తారోకో నిర్వహించారు. లక్ష్మీసాగర్ ప్రాజెక్ట్​లో లక్ష్మాపూర్ గ్రామానికి 60 శాతం వాటా ఉన్నప్పటికీ మేడిపల్లి గ్రామస్థులు వాటా చేపలు ఇవ్వట్లేదని చెప్పారు. రాత్రివేళ చేపలు పడుతూ అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు.

CHANDUR | సంఘటనాస్థలానికి ఏసీపీ..

బోధన్ ఏసీపీ శ్రీనివాస్, మత్స్యశాఖ ఏడీ ఆంజనేయులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులను సముదాయించి రాస్తారోకోను విరమింపజేశారు. ఇరు గ్రామాల పెద్దలతో పోలీసులు, మత్స్యశాఖ అధికారులు సమావేశం నిర్వహించి సమస్య పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని పేర్కొనడంతో వారు ఆందోళన విరమించారు.

Advertisement