అక్షరటుడే, వెబ్‌డెస్క్: Pakistan | పాకిస్తాన్‌లో రైలు హైజాక్ అయ్యింది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ(BLA) జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను హైజాక్(Jaffar Express) చేసింది. ఆ రైలులోని 120 మంది యాత్రికులను బంధించింది.
పాకిస్తాన్‌లోని బోలన్, మష్కాఫ్ ప్రాంతంలో జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను హైజాక్ చేసి, 120 మంది ప్రయాణికులను బంధించడంతో పాటు 6 మంది సైనికులను హతమార్చినట్లు బలూచ్ లిబరేషన్ ఆర్మీ(balochistan liberation army) ప్రకటించింది. రైల్వే ట్రాక్ పేల్చేసి రైలును ఆపింది. ఆ తర్వాత ప్రయాణికులను అదుపులోకి తీసుకుంది. సైనిక చర్యకు పాల్పడితే, బంధీలందరినీ హతమారుస్తామని హెచ్చరించింది.
BLA స్పెషలైజ్డ్ యూనిట్లు – మజీద్ బ్రిగేడ్, STOS, & ఫతేహ్ స్క్వాడ్ ఈ దాడికి పాల్పడ్డాయి. “సైనిక చర్య జరిగితే, మేము సమాన స్థాయిలో ప్రతిస్పందిస్తాం” అని బలూచ్ లిబరేషన్ ఆర్మీ స్పష్టం చేసింది.
ఇప్పటి వరకు ఆరుగురు సైనికులను హతమార్చినట్లు BLA ధృవీకరించింది. ఈ హైజాక్‌కు పూర్తి బాధ్యత వహిస్తున్నట్లు BLA అధికార ప్రతినిధి జియాండ్ బలూచ్ ప్రకటించాడు. పాకిస్తాన్‌లో ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందోనని ప్రజలు ఎదురు చూస్తున్నారు.