Advertisement
అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. మంగళవారం ఆయన భిక్కనూరు పోలీస్‌స్టేషన్‌ను సందర్శించారు. ఠాణాలో పనిచేస్తున్న సిబ్బందితో మాట్లాడారు. స్టేషన్ పరిధిలో ఉండే గ్రామాల వివరాలను ఎస్సై ఆంజనేయులును అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్టేషన్ పరిసర ప్రాంతాలను, రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని సిబ్బందికి సూచించారు. ఎస్పీ వెంట సీఐ సంపత్ కుమార్ ఉన్నారు.
Advertisement