Gold | ఎయిర్​పోర్టులో బంగారం ఎందుకు పట్టుకుంటారంటే..

Gold | ఎయిర్​పోర్టులో బంగారం ఎందుకు పట్టుకుంటారంటే..
Gold | ఎయిర్​పోర్టులో బంగారం ఎందుకు పట్టుకుంటారంటే..
Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్: Gold | ఎయిర్​ పోర్టులో బంగారం పట్టుకున్న కస్టమ్స్​ అధికారులు అని మనం నిత్యం వార్తలు చూస్తుంటాం. అయితే అసలు బంగారం ఎందుకు పట్టుకుంటారనే విషయాలు తెలుసుకుందాం. ఇటీవల కన్నడ నటి రన్యారావు సుమారు 14 కిలోల బంగారం దుబాయి నుంచి అక్రమంగా తెస్తూ అధికారులకు పట్టుబడింది. దీంతో దుబాయ్ లేదా ఇతర దేశాల నుంచి మనం ఎంత బంగారం తెచ్చుకోవచ్చో తెలుసుకుందాం.

Gold | దుబాయి నుంచే ఎందుకు..!

ఎక్కువగా మనదేశానికి బంగారాన్ని స్మగ్లింగ్​ చేసేవారు దుబాయి నుంచే తెస్తారు. ఎందుకంటే అక్కడ మనదేశంతో పోలిస్తే బంగారం ధరలు చాలా తక్కువగా ఉంటాయి. అక్కడి ప్రభుత్వం బంగారంపై ఎలాంటి పన్నులు వేయదు. అలాగే అక్కడ వ్యాపారుల మధ్య పోటీ ఉండటంతో ఆఫర్లు కూడా పెడతారు. దీంతో బంగారం తక్కువ ధరకు కొనుగోలు చేసుకొని మన దేశానికి తీసుకువస్తారు. అయితే పరిమితికి మించి బంగారం కొనుగోలు చేసి తీసుకొచ్చినా అధికారులు సీజ్​ చేస్తారు.

Gold | ఎంత తెచ్చుకోవచ్చంటే..

దుబాయి నుంచి కొంత మొత్తం బంగారాన్ని ఎలాంటి పన్నులు కట్టకుండా తెచ్చుకోవచ్చు. పరిమితికి మించి తెచ్చుకుంటే మాత్రం కస్టం సుంకం చెల్లించాలి. విదేశాలలో ఆరు నెలలకు మించి ఉన్న వారు ఎవరైనా బంగారం తెచ్చుకోవాలంటే మగవారికి 20 గ్రాములు, మహిళలకు 40 గ్రాములు అనుమతిస్తారు. అంతకు మించి తీసుకువస్తే మాత్రం అధికారులు పన్ను వసూలు చేస్తారు. విదేశాలకు వెళ్లి ఆరు నెలలలోపు బంగారం తీసుకొని వస్తే మాత్రం 38.5 శాతం కస్టం సుంకం చెల్లించాల్సి ఉంటుంది.

ఇది కూడా చ‌ద‌వండి :  RTC | నిజామాబాద్ ఆర్టీసీ బస్సులో మంగళసూత్రం చోరీ

Gold | పన్ను తగ్గించిన కేంద్రం

బంగారం స్మగ్లింగ్​ను అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గతంలో 15శాతం ఉన్న కస్టం ట్యాక్స్​ను ఆరు శాతానికి తగ్గించింది. అయినా బంగారం అక్రమ రవాణా ఆగకపోవడం గమనార్హం. అయితే అధికారులు పట్టుకున్న బంగారానికి నిర్దేశిత పన్ను చెల్లించిన తర్వాత వారికి తిరిగి అప్పగిస్తారు.

Advertisement