అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | ఎస్సీ వర్గీకరణ చట్టం చేసేవరకు ఉద్యోగ నియామకాలు చేపట్టవద్దని, గ్రూప్1, గ్రూప్2 ఫలితాలను ప్రకటించవద్దని ఎమ్మార్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాదిగలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్నారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టం తెస్తామని చెబుతూనే, ఉద్యోగ పరీక్ష ఫలితాలు విడుదల చేయడంపై మండిపడ్డారు. కార్యక్రమంలో నాయకులు పద్మారావు, లక్ష్మి, యాదగిరి, సాయిలు, రంగరి సాయిలు, అల్లూరి, శివరాజు, బాగయ్య, తదితరులు పాల్గొన్నారు.
Kamareddy | వర్గీకరణ చేసేవరకు నియామకాలు చేపట్టవద్దు
Advertisement
Advertisement