Advertisement
అక్షరటుడే, భిక్కనూరు: ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకి మంత్రి పదవి ఇస్తే జిల్లా మరింత అభివృద్ధి చెందుతుందని దోమకొండ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బల్యాల సుదర్శన్, భిక్కనూరు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బల్యాల రేఖ పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేశారు. మాజీ సీఎం రాజశేఖర్‌రెడ్డి హయాంలో షబ్బీర్ అలీ విద్యుత్‌శాఖ మంత్రిగా రాష్ట్రానికి ఎంతో సేవ చేశారన్నారు. ఎంతో అనుభవమున్న ఆయనను రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాన్ని కాంగ్రెస్ అధిష్టానం పరిశీలించాలని కోరారు.
Advertisement