Kotagiri | శ్రీవేద హైస్కూల్‌లో ఆకట్టుకున్న సైన్స్‌ఫెయిర్‌

Kotagiri | శ్రీవేద హైస్కూల్‌లో ఆకట్టుకున్న సైన్స్‌ఫెయిర్‌
Kotagiri | శ్రీవేద హైస్కూల్‌లో ఆకట్టుకున్న సైన్స్‌ఫెయిర్‌
Advertisement

అక్షరటుడే, కోటగిరి: Kotagiri | మండల కేంద్రంలోని శ్రీవేద హైస్కూల్‌లో బుధవారం సైన్స్‌ఫెయిర్‌ నిర్వహించారు. ఎంఈవో శ్రీనివాస్‌రావు హాజరై విద్యార్థుల ప్రదర్శనలు తిలకించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు.

విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ఇలాంటి విజ్ఞాన మేళాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. చదువుతో పాటు శాస్త్ర, సాంకేతిక, గణిత అంశాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. అనంతరం పాఠశాల యాజమాన్యం ఎంఈఓను సత్కరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రవీందర్, పాఠశాల కరస్పాండెంట్‌ అక్షర, డైరెక్టర్‌ రవికుమార్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  Kotagiri | ఇఫ్తార్‌ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే పోచారం