అక్షర టుడే, వెబ్‌డెస్క్: Nizamabad | జిల్లా కోర్టు ఆవరణలో పంజాబ్ నేషనల్ బ్యాంకు, గుర్బాబాది బ్రాంచ్ ఆధ్వర్యంలో బుధవారం జీరో బ్యాలెన్స్ బ్యాంక్ అకౌంట్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా జడ్జి కుంచాల సునీత హాజరై మాట్లాడారు.
జీరో బ్యాలన్స్ బ్యాంక్ ఖాతాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ మాధవీలత మాట్లాడుతూ.. జీరో బ్యాలన్స్ అకౌంట్‌తో డబ్బులు ఆదా చేసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది జగదీశ్వర్ రావు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. రేపు కూడా మేళా ఉంటుందని బీఎం తెలిపారు.