అక్షరటుడే, కామారెడ్డి: KAMAREDDY RDO | కామారెడ్డి ఆర్డీవోగా వీణ(Rdo Veena) బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్‌ను(Kamareddy Collector) మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.
ఇదివరకు ఇక్కడ పనిచేసిన ఆర్డీవో శ్రీనివాస్ రెడ్డి రెండు నెలల క్రితం పదవీ విరమణ పొందారు. అప్పటి నుంచి ఎల్లారెడ్డి ఆర్డీవో మన్నె ప్రభాకర్ ఇన్‌ఛార్జి ఆర్డీవోగా కొనసాగుతున్నారు. బుధవారం పూర్తిస్థాయి ఆర్డీవోగా వీణ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమెకు పలువురు తహశీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది స్వాగతం పలికారు.