అక్షరటుడే, ఇందూరు: YOUTH EXCHANGE | డిచ్పల్లి ఎస్బీఐ ట్రైనింగ్ సెంటర్లో కొనసాగుతున్న అంతర్ జిల్లాల ‘యువ ఎక్స్చేంజ్‘ కార్యక్రమం బుధవారం ముగిసింది. కేంద్ర యువజన క్రీడ మంత్రిత్వ శాఖ, నెహ్రూ యువ కేంద్ర సంయుక్త ఆధ్వర్యంలో యాత్ర జరిగింది. హైదరాబాద్ జిల్లాకు చెందిన 30 మంది యువతీయువకుల బృందం జిల్లాలోని చారిత్రక ప్రదేశాలు, కర్మాగారాలు, దర్శనీయ స్థలాలను సందర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన అధికారిణి శైలి బెల్లాల్, శిక్షణ సంస్థ డైరెక్టర్ శ్రీనివాస్, వ్యక్తిత్వ వికాస నిపుణుడు మహేష్ తదితరులు పాల్గొన్నారు.
YOUTH EXCHANGE | ముగిసిన యువ ఎక్స్చేంజ్
Advertisement
Advertisement