Mahammad Nagar | ఘనంగా ఫేర్​వెల్​ పార్టీ

Mahammad Nagar | ఘనంగా ఫేర్​వెల్​ పార్టీ
Mahammad Nagar | ఘనంగా ఫేర్​వెల్​ పార్టీ
Advertisement

అక్షరటుడే, నిజాంసాగర్ : Nizam sagar | మహమ్మద్ నగర్ మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో బుధవారం పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఎంఈవో అమర్ సింగ్ పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు వార్షిక పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి పాఠశాలకు పేరు తేవాలన్నారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎం మధుసూదన్ రాజ్, కరుణాకర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు అందజేశారు.

Advertisement