Todays Gold Rate : మ‌ళ్లీ పెరిగిన బంగారం ధ‌ర‌లు.. ఎంత పెరిగాయి అంటే..!

Todays Gold Rate : మ‌ళ్లీ పెరిగిన బంగారం ధ‌ర‌లు.. ఎంత పెరిగాయి అంటే..!
Todays Gold Rate : మ‌ళ్లీ పెరిగిన బంగారం ధ‌ర‌లు.. ఎంత పెరిగాయి అంటే..!
Advertisement

అక్ష‌ర‌టుడే, వెబ్‌డెస్క్‌ Todays Gold Rate : ఈ మ‌ధ్య Gold Rate బంగారం ధ‌ర‌ల‌లో హెచ్చు త‌గ్గులు మ‌నం గ‌మ‌నిస్తున్నాం. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా అయినప్పటి నుంచి బంగారం, Silver prices వెండి ధరల్లో ఈ మార్పులు కనిపిస్తున్నాయి. అయితే ఫిబ్రవరి 14 హోలీ Holi కావడంతో బంగారం ధరలు భారీగానే పెరిగాయి. దక్షిణాదిలో కంటే ఉత్తరాదిలో Holi హోలీ పండుగను లక్ష్మీదేవీనిగా కొలుస్తార‌నే విష‌యం తెలిసిందే. ఈ క్రమంలో Gold Rates బంగారం ధ‌ర‌లు పెరిగాయి. నేడు మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల Gold Rate బంగారం ధర రూ.87,980 ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.80,650గా ఉంది. ఇక‌ వెండి ధరలు కాస్త తగ్గ‌డం ఉప‌శ‌మ‌నం క‌లిగించింది. నేడు కేజీ వెండి ధర రూ.98,900గా ఉంది. అయితే ప్రాంతం, సమయాన్ని బట్టి బంగారం, వెండి Silver prices ధరల్లో కాస్త మార్పులు ఉంటాయి.

Todays Gold Rate : హోళి ఎఫెక్ట్..

ఇంటర్నేషనల్ మార్కెట్లో ఒక్కసారిగా గోల్డ్ ధరలు బారీగా పుంజుకున్నాయి. కిందటి రోజు స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 2910 డాలర్ల స్థాయిలో ఉండగా.. ఇప్పుడు అది 2940 డాలర్లకు పెరగడం అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం రూ. 450 పెరగ్గా.. 22 క్యారెట్స్ గోల్డ్ రేటు ఇప్పుడు తులం రూ. 80,650 కి ఎగబాకింది. దీనికి ముందు రోజు రూ. 300 తగ్గ‌గా, ఇదే సమయంలో 24 క్యారెట్లకు చెందిన స్వచ్ఛమైన గోల్డ్ రేటు రూ. 490 పెరగడంతో 10 గ్రాములకు రూ. 87,980 కి చేరుకుంది. ఢిల్లీలో కూడా రేట్లు ఇలానే పెరిగాయి. ఇక 22 క్యారెట్లు, 22 karat, 24 karat gold 24 క్యారెట్ల బంగారం రేట్లు ఇక్కడ తులానికి వరుసగా రూ. 80,800; రూ. 88,130 వద్ద ట్రేడవుతున్నాయి.

ఇది కూడా చ‌ద‌వండి :  Holi | హోలీ వేడుకలపై ఆంక్షలు

బంగారం ధరల బాటలోనే వెండి రేట్లు Silver prices కూడా కొన్ని చోట్ల‌ పుంజుకున్నాయి. ఢిల్లీ మార్కెట్లో తాజాగా రూ. 2 వేలు పెరగడంతో ప్రస్తుతం కిలో అక్కడ రూ. లక్ష మార్కుకు చేరింది. ఇదే సమయంలో హైదరాాబాద్ నగరంలో చూసినట్లయితే రూ. 2000 ఒక్కరోజే పెరిగి ప్రస్తుతం కేజీ సిల్వర్ రేటు రూ. 1.09 లక్షలకు చేరిన‌ట్టు తెలుస్తుంది. ఇక బంగారం, వెండి రేట్లు అనేవి ప్రాంతాల్ని బట్టి మారుతుంటాయి. విజయవాడలో 10 గ్రాముల ధర రూ.87,980 కాగా, ఢిల్లీలో10 గ్రాముల ధర రూ.88,140, ముంబైలో 10 గ్రాముల ధర రూ.87,990, కోల్‌కతాలో 10 గ్రాముల ధర రూ.87,980, చెన్నైలో 10 గ్రాముల ధర రూ.87,990, బెంగళూరులో 10 గ్రాముల రూ.87,990, పుణెలో 10 గ్రాముల ధర రూ.87,990గా ఉన్నాయి.

Advertisement