అక్షరటుడే, వెబ్‌డెస్క్ Nara Chandrababu : ప్రస్తుతం ఏపీ రాజకీయాలు హీటెక్కిపోతున్నాయి. ఒకవైపు ప్రత్యర్ధులపై పంచ్‌లు విసరడం, మరోవైపు సొంత పార్టీలోనే లుకలుకలతో ఏపీ రాజకీయం వాడివేడిగా సాగిపోతుంది. అయితే మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి Vijayasai Reddy YCP వైసీపీపైనా, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి Jagan Mohan Reddyపైన సంచలన ఆరోపణలు చేయడం హాట్ టాపిక్ అయింది. విజయ సాయి రెడ్డి ఆరోపణలపై మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి Kakani Govardhan Reddy.. విజయసాయిరెడ్డి Vijayasai Reddy ఆరోపణలపై స్పందించారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు Nara Chandrababu Naidu డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగమే విజయసాయిరెడ్డి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నాడంటూ కౌంటర్ ఇచ్చారు.
Nara Chandrababu : భలే కౌంటర్ ఇచ్చాడుగా..
రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తే ఆ స్థానం కూటమికి దక్కుతుంది కాబట్టి, విజయ్ సాయి రెడ్డి ఇదంతా చేశారని కాకాణి అన్నారు.. ఇందులో గూడుపుఠాని ఉందన్న అనుమానం కలుగుతోందన్నారు. రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత వ్యవసాయం చేసుకుంటానన్న విజయసాయిరెడ్డి.. Nara Chandrababu చంద్రబాబుకు సాయం చేస్తున్నారంటూ పలు ఆరోపణలు చేశారు కాకాణి. వైఎస్ జగన్ Jagan వద్ద ఎలాంటి కోటరీలు లేవని, జగన్ సీఎంగా ఉన్నప్పుడు విజయసాయిరెడ్డి గంటలు, గంటలు ఆయనతో మాట్లాడేవారని కాకాణి గోవర్ధన్ రెడ్డి చెప్పుకొచ్చారు.
మరోవైపు కాకినాడ పోర్ట్ వాటాలని అక్రమంగా బదిలీ చేయించుకున్నారనే ఆరోపణలపై విజయసాయిరెడ్డిని ఏపీ సీఐడీ అధికారులు విచారించగా, అనంతరం విలేకర్లతో మాట్లాడిన విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ చుట్టూ కోటరీ ఉందనీ, ఈ కోటరీతో జగన్‌కు తీవ్ర నష్టం జరుగుతోందని, కోటరీ నుంచి బయటపడకపోతే రాజకీయ భవిష్యత్ కూడా ఉండదంటూ పలు ఆరోపణలు చేశారు. కొందరు నన్ను ఎదగకుండా పైకి లాగారని, అయితే జగన్‌కి నా మనసులో సుస్థిరమైన స్థానం ఉందని, జగన్ మనసులో మాత్రం నాకు లేకపోవడంతో బయటకి వచ్చినట్టు విజయసాయి రెడ్డి ఆరోపణలు చేశారు. వైసీపీలో ఉండాలని వైఎస్ జగన్ తనను కోరారన్న విజయసాయిరెడ్డి.. కానీ, తాను అందుకు అంగీకరించలేదంటూ పేర్కొన్నారు.
విజయసాయిరెడ్డి వ్యవసాయం చేసుకుంటానని చెప్పి చంద్రబాబుకు సాయం చేస్తున్నాడు : కాకాణి గోవర్ధన్ రెడ్డి
వైసీపీలో ఉన్నప్పుడు గంటల తరబడి జగన్ తో ఉండేది విజయసాయి రెడ్డినే
ఆయనకు మించిన కోటరీ ఇంకెవరు ఉంటారు ?
చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే విజయసాయి ఆ వ్యాఖ్యలు చేసినట్లు… pic.twitter.com/dMZCH6w2jH
— BIG TV Breaking News (@bigtvtelugu) March 12, 2025