Advertisement
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Tirumala | ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో అక్రమ నిర్మాణాలపై ఏపీ హైకోర్టు సీరియస్ అయింది. వీటిపై ఇటీవల హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వాటి విచారణ సందర్భంగా న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. తిరుమలను కాంక్రీట్ జంగిల్‌గా మార్చొద్దని సూచించింది. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని టీటీడీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. భవన నిర్మాణాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ధార్మిక సంస్థల పేరుతో అక్రమ నిర్మాణాలు చేపడితే అటవీ ప్రాంతం కనుమరుగు అవుతుందని కోర్టు వ్యాఖ్యానించింది.
Advertisement